iDreamPost
iDreamPost
ప్రజలు వారి రోజువారీ దినచర్యలలో భాగంగా వేలాది వార్తలు వింటూ , చూస్తూ ఉంటారు. వీరిలో కొందరు చూసిన వార్తను బట్టి అది ప్రచారమా లేదా జర్నలిజమా అనేది అత్యంత సులభంగా తెలుసుకోగలుగుతారు, కాని కొంత మంది ప్రజలు మాత్రం వారి దైనందిన జీవితంలో సమయాభావం వలనో మరో కారణం చేతనో వార్తలను సమగ్రంగా పరిశీలించే అవకాశం లేక ముఖ్యాంశాల వరకూ చూసి వదిలేస్తారు . ఇలాంటి వారికి ఏ వార్త వెనక ఏ ఉద్దేశం దాగున్నదో కనుక్కోవడం కష్టమైన పని . సరిగ్గా ఇలాంటి వారే ఆంద్రప్రదేశ్ లో ఒక వర్గం పత్రికకు టార్గెట్. వారి లక్ష్యాన్ని చేదించడానికి వీరినే తమ ఎల్లో జర్నలిజం తో పావులుగా వాడతారు. జగనే టార్గెట్ గా రెచ్చిపోతారు. దీనికి ఉదాహరణ సదరు పత్రికలో వచ్చిన నేటి వార్తను చూపే దృకోణం లో ఉన్న వ్యత్యాసం.
వివరాల్లోకి వెలితే ఈ ఏడు వర్షాలు అధికంగా పడటంతో వరద వచ్చినా ఆ నీరు నిల్వ చేసుకునే అవకాశం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి లేక సుమారు 1100 టి.ఎం.సి.ల నీరు సముద్రంలో వృదాగా కలిసిపోయింది. కళ్ళముందే మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతున్నా ఒడిసి పట్టలేక చూస్తూ వుoడిపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్ పరిష్కారంగా దిశగా ఆలోచన చేశారు, కరువు కోరల్లో చిక్కుక్కున్న రాయలసీమ ప్రాంతాన్ని ధాన్య రాశిగా మార్చాలనే లక్ష్యంతో 44,000 క్యూసెక్కుల కెపాసిటి ఉన్న పోతిరెడ్డిపాడును , 80,000 క్యూసెక్కులకు పెంచుతూ GO నంబర్ 203 విడుదల చేసారు .
దీనిని తెలంగాణలో కొన్ని వర్గాలు తప్పు పట్టినా వాస్తవం చూస్తే వేరుగా ఉంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కేవలం సముద్రలో కలిసే మిగులు జలాలు మాత్రమే వాడుకునే ఉద్దేశ్యంతో జీవో విడుదల చేసింది. దీనివలన ఏ ఒప్పందాలు, ఏ నియమాలు తప్పినట్టు అవ్వదు. వాస్తవానికి చట్ట ప్రకారం ఇరు రాష్ట్రాల నీటి వాటాలు ఎవరివి వారికే ఉన్నాయి . కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్రమం అని. ఈ మేరకు బోర్డుకు ఫిర్యాదు చేసింది .
అయితే ఈ వార్తలో ఉన్న విషయం కన్న జగనే టార్గట్ గా పనిచేసే పత్రికలు రాష్ట్ర , ప్రాంత ప్రయోజనాలు పక్కన పెట్టిట్టి ముఖ్యమంత్రి జగన్ ను ప్రజల్లో ఎలా పలుచన చేయాల అనే ఆలోచనకు పదును పెట్టాయి , ఈ క్రమంలో ఈ రోజు ఆ పత్రికలో వెలువడిన ఈ వార్తను ఒక పదకం ప్రకారం అచ్చు వేసింది అని చెప్పొచ్చు . తెలంగాణ మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో తెలంగాణ వాదన మాత్రమే అచ్చు వేసి ఆంద్ర ప్రదేశ్ వాదనను ఉద్దేశ పూర్వకంగా తొక్కి పెట్టింది. ఇక ఆంద్రకు వచ్చే సరికి అదే మొదటి పేజీలో ఆంద్రప్రదేశ్ వాదన చెబుతూనే తెలంగాణ చెబుతున్న చట్ట విరుద్దం అనే వాదనని ప్రధానంగా అచ్చు వేసి ఒక ప్రాంత ప్రజల్లో అభద్రతా భావం పెరిగేలా వ్యవహరించింది సదరు పత్రిక.
ఇలా ఒక రాష్ట్రంలో ఒక విధంగా , మరో రాష్ట్రంలో ఒక విధంగా వ్యవహరిస్తున్న ఈ పత్రిక వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రిగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రతిభందకాలు ఎదురౌతూ, ఏ పనిలోను సఫలీకృతం కాలేకపోతున్నారు అని ప్రజలకు ప్రభుత్వం పై అపోహలు సృష్టించేందుకు చేసే ప్రయత్నమే అని చెప్పొచ్చు . ముఖ్యమంత్రి జగన్ చేపట్టినది మంచి కార్యక్రమం అనే ఆలోచనలో ఉన్న ప్రజలకు, ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఈ పని జరిగే అవకాశం తక్కువ అనే భావన కలిగేలా వారి ఆశలపై నీలి నీడలు కమ్ముకునేలా చెయడమే వారి ముందు ఉన్న ప్రధాన ఎజండా.
యావత్ భారత దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు, అధికార పార్టీలు , ప్రతిపక్షాలు వారి మధ్య విధానపరమైన కలహాలు సర్వ సహజం , కానీ వారి రాష్ట్రంలో కాని ప్రాంతంలో కాని ప్రజా సమస్యలు వచ్చేసరికి వారు అంతా ఏకమై ఒక్క తాటిపై నడుస్తారు. కానీ ఒక్క ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ప్రజలు ఏమైపోయినా, ప్రాంతాలు ఎంత నష్టపోయినా, రాష్ట్ర భవిష్యతుకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి వచ్చినా రాష్ట్ర ప్రజలకు మద్దతుగా నిలవడానికి రాకపోగా తిరిగి బురద జల్లే కార్యక్రమం చేస్తాయి. వారికి రాష్ట్ర అభ్యుదయం మీద ఆశక్తి లేకపోగా రాజకీయంగా వారికి ఉన్న ఉమ్మడి టార్గెట్ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఆయా వర్గాలకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా పట్టవు. దీనికి ఉదాహరణ గా తాజాగా రాష్ట్ర ప్రతిపక్ష నేత పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు 203 జీవో పై ఎలాంటి ప్రకటనలు చేయవద్దు అని వారి పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం . ఇటువంటి దోరణిలో పత్రికలు, ప్రతిపక్షాలు ఉండటం అత్యంత ప్రమాదకరం అని విశ్లేషకుల మాట.