Idream media
Idream media
కరోనా వైరస్.. ఈ పేరుంటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. దీన్ని ఎదుర్కొని నిలబడ్డవారు యోధులు అవుతున్నారు. నిలబడలేని వారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులను సైతం ఈ వైరస్ పైకి లేపుతోంది.. అంతలోనే కిందపడేస్తోంది. పాలనలో విశేష గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ ను ఓ స్థాయిలో అమాంతం పైకి లేపితే, మరో స్థాయిలో కిందకు పడేసింది. కానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన చర్యలు ద్వారా అంతకంతకూ తన గ్రాఫ్ పెంచుకుంటూనే ఉంటున్నారు. ఏదో అంశాన్ని హైలెట్ చేసి జగన్ గ్రాఫ్ ను తగ్గించాలని ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నం చేసినా ఫలించడం లేదు. ఆ క్రమంలో వారి గ్రాఫ్ మరింత పడిపోతోంది. ప్రజల్లో మైలేజ్ తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు.
ముఖ్యమంత్రి కాగానే పాలనలో విప్లవాత్మక మార్పుల ద్వారా దేశం దృష్టిని ఆకర్షించిన జగన్.. కరోనా విపత్తు కట్టడి చర్యలలోనూ మొదటి నుంచీ ముందు వరుసలో ఉంటున్నారు. రెండో దశలో మోదీ గ్రాఫ్ తగ్గినా కానీ, జగన్ గ్రాఫ్ మాత్రం మళ్లీ పెరిగిందని పలు సర్వేలు స్పష్టం చేశాయి. అదెలా సాధ్యమనే విషయాన్ని ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. కరోనా ఎంతటి విలయం సృష్టిస్తున్నా.. రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచే విషయంలో జగన్ వెనుకడుగు అన్నదే లేకుండా సాగుతున్నారు. ఎన్నికలకు ముందు తాను ప్రకటించిన పథకాల అమలుతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన పథకాల అమలును నాన్ స్టాప్ గా జగన్ కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా సాకు చూపి ఏ ఒక్క పథకాన్ని ఆపిన దాఖలా ఏపీలో కనిపించడమే లేదు.
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారుతున్నా… సంక్షేమ పథకాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా జగన్ చూస్తున్నారు. ఆయా పథకాల అమలుకు కావాల్సిన నిధులను ఎలాగోలా సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక కరోనా కట్టడిలో కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా జగన్ సాగుతున్నారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్నా… ఏమాత్రం భయపడకుండా జగన్ తనదైన శైలి చర్యలతో సాగుతున్నారు. కరోనా కట్టడిలో జగన్ సర్కారు తీసుకున్న పలు చర్యలను దేశంలోని ఇతర రాష్ట్రాలు మక్కీకి మక్కి కాపీ కొట్టేశాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కరోనా కష్టకాలంలోనూ జగన్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతూనే ఉంది.
జగన్ సర్కారు ఆదేశాలను అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అమలు చేస్తోంది. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో దానిని కట్టడి చేయడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటిపోవడంతో తలెత్తుతున్న ఘటనలను ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఆందోళనకు శ్రీకారం చుడుతూ హడావిడి చేస్తోంది. ఆ పార్టీ చర్యలను మెజార్టీ ప్రజలు పట్టించుకోకపోగా తిట్టి పోస్తున్నారు.