iDreamPost
android-app
ios-app

మీకు జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం జగన్

మీకు జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పరిపాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంటి నేటి వరకు కూడా పేద ప్రజల అభివృద్థి కోసం కృషి చేస్తున్నారు. నవరత్నాల పేరుతో అనేక పథకాలను  అన్ని వర్గాల ప్రజలకు  జగన్ సర్కార్ అందిస్తుంది. కేవలం ప్రజలకే కాకుండా చదువుకునే విద్యార్థులకు సైతం నేనున్నాను అంటూ సీఎం జగన్ ఆర్థిక సాయం చేస్తున్నారు. వివిధ పథకాల పేరుతో విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఇటీవలే పదో తరగతిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను  జగనన్న ఆణిముత్యాల పేరుతో సన్మానిస్తున్నారు.

రాష్ట్ర విద్యాశాఖ జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈనెల 12 నుంచి 19 వరకు పదో తరగతి పరీక్షల్లో టాపర్లకు సత్కారాలు చేస్తుంది.ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమలో సీఎం జగన్ పాల్గొన్నారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని పదోతరగతి, ఇంటర్‌ స్టేట్‌ లెవల్‌ టాపర్స్‌ని సన్మానించారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. విద్యార్థులను ఉద్దేశిస్తూ.. మీరు బాగా చదువుకోండి.. ఎంత ఖర్చైన భరిస్తామన్నారు. మీకు ఈ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు.

ఇంకా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…” మన మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి  ఫలాలు అందించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్, ఫ్యూచర్ ఆఫ్ ఏపీ మనదే. ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాము. అలానే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతోనే .. విద్యాదీవెన, విద్యా వసతి  చేపట్టాం. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటాం. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడం” అంటూ విద్యార్థులను ఉద్దేశించి జగన్ స్పష్టం చేశారు.

ఇక జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈ నెల 12 నుంచి వారం పాటు సత్కారాలు నిర్వహిస్తున్నారు. టెన్త్ లో ఫస్ట్ ర్యాంకర్ కు  లక్ష, సెకండ్ ర్యాంకర్ కు రూ.75 వేలు, థర్డ్ ర్యాంకర్ కు రూ.50 వేలు ప్రోత్సాహకం ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. అలా మొత్తం 42 మందికి ఈ నగదును అందిస్తారు. ర్యాకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించస్తున్నారు.

జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలు వివరాలు ఇవే..

టెన్త్ లో రాష్ట్రస్థాయిలో నగదు పురస్కారం ఫస్ట్ ర్యాంకర్ కు రూ.లక్ష, సెకండ్ 75 వేలు, థర్డ్ 50 వేలు ఇవ్వనున్నారు. ఈ విద్యార్థులు 42 మంది ఉన్నారు.

జిల్లా స్ధాయి నగదు పురస్కారం ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ 30 వేలు, తృతీయ 15 వేలు ఇస్తున్నారు. ఈ విద్యార్థుల సంఖ్య 609 గా ఉంది.

ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా నగదు పురస్కారం ఇస్తున్నారు. ఇక్కడ మొదటి ర్యాంకర్  కు  రూ.15 వేలు, రెండవ ర్యాంకర్  కు రూ.10 వేలు, మూడవ ర్యాంకర్ కు 5 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఈ విద్యార్థుల సంఖ్య 681 ఉంది.

పాఠశాల స్థాయిలో ప్రథమ రూ.3 వేలు, ద్వితీయ రూ.2 వేలు, తృతీయ రూ.1000 అందజేయనున్నారు. ఈ విద్యార్థులు 20,299 మంది ఉన్నారు.

ఇక ఇంటర్ స్థాయిలో జగనన్న ఆణిముత్యాలు ఇలా..

ఇంటర్మీడియట్  లో గ్రూపుల వారీగా స్టేట్ టాపర్స్‌కు నగదు పురస్కారం రూ.లక్ష, ఇవ్వనున్నారు. వీరి సంఖ్య 26 ఉంది.

జిల్లాస్థాయిలో టాపర్స్ కు  గ్రూపుల వారీగా.. రూ.50 వేలు  అందజేస్తారు. ఈ విద్యార్ధుల సంఖ్య 391.

నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా.. రూ.15 వేలు, విద్యార్థులు సంఖ్య-662

ప్రోత్సాహకం అందుకోనున్న మొత్తం విద్యార్థుల సంఖ్య–22,710

టాపర్ విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తున్నారు. మరి.. ఈ కార్యక్రమంపై ,సీఎం జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.