iDreamPost
android-app
ios-app

ప్ర‌భుత్వ విద్యా వ్య‌వ‌స్థ‌కు గుర్తింపు తెచ్చిన జ‌గ‌న్

ప్ర‌భుత్వ విద్యా వ్య‌వ‌స్థ‌కు గుర్తింపు తెచ్చిన జ‌గ‌న్

ఇప్పుడు దేశ‌మంతా ప్రైవేటీక‌ర‌ణ బాట ప‌డుతోంది. చాలా రాష్ట్రాలు కూడా త‌మ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రించ‌డ‌మో, ఇత‌ర సంస్థ‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డ‌మో చేస్తున్నాయి. కానీ, ఏపీలో మాత్రం ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు ప్రాధాన్యం ద‌క్కుతోంది. అందులో ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ విద్యా వ్య‌వ‌స్థ‌ను చెప్పుకోవ‌చ్చు. ఒక‌ప్పుడు డ్రాప‌వుట్స్ ఎక్కువ‌గా ఉండే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇప్పుడు దాదాపు జీరో. అంతేకాదు.. నో వేకెన్సీ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయంటే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ఎంత‌లా గుర్తింపు పొందాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్రభుత్వ పాఠశాలలంటే ఉండే చిన్న చూపు ఏపీలో లేదు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌ల కంటే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేర్పించేందుకు ఆస‌క్తి చూపుతున్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అక్క‌డ సౌక‌ర్యాలు ఉండ‌వు.. చ‌దువులు చ‌క్క‌గా సాగ‌వు.. అనే ప‌రిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు పోతోంది. ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం.. సరైన బోధనా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇన్నాల్లు పాఠశాలలు కుదేలయ్యాయి. అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు పాఠశాలలను పునరుద్ధరిస్తామని.. పేద వెనుకబడిన తరగతులకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చాయి. కానీ వారి మాటలు ఇప్పుడు జగన్ సర్కార్ హయాంలో వాస్తవంగా మారాయి.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా నగదు బదిలీ చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని జగన్ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలను ‘నాడు నేడు’ పేరుతో పూర్తిగా నిధులు సమకూర్చి మార్చేశారు. వాటికి రేటింగ్ ఇచ్చారు. పది పాయింట్ల ఫార్ములా తయారు చేశారు. గత రెండు సంవత్సరాలుగా విద్యా శాఖ జగన్ సంకల్పం నెరవేరేలా చాలా ప్రయత్నం చేసింది. తరగతి గదుల్లో నాణ్యమైన ఫర్నిచర్ మరుగుదొడ్లు సురక్షితమైన తాగునీరు పరిశుభ్రమైన వంటగది పోషక ఆహారం కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం మెరుగైన పరికరాలతో పాఠశాలలు పటిష్టమయ్యాయి. చాలా సమస్యలు పరిష్కరించబడ్డాయి.

జ‌గ‌న్ ప్రయత్నాలు ఫ‌లిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రవేశాలకు డిమాండ్ పెరిగింది ఎంతలా అంటే ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకెన్సీ బోర్డులు క‌నిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం ఇప్పుడు డిమాండ్ ఇంకా ఎక్కువగానే ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు పోటీపడుతూ దక్కకపోతే ఆందోళన చెందుతున్న పరిస్థితి వ‌చ్చిందంటే.. దాని వెనుక జ‌గ‌న్ అపార కృషి ఉంది.