iDreamPost
android-app
ios-app

నకిలీ సర్టిఫికెట్- అశోక్ బాబు మీద సిఐడి కేసు

నకిలీ సర్టిఫికెట్- అశోక్ బాబు మీద సిఐడి కేసు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల నేతగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి ఎమ్మెల్సీగా ప్రస్తుతం పదవిలో ఉన్న అశోక్ బాబు కి ఏపీ సిఐడి షాక్ ఇచ్చింది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో లోకాయుక్త ఆదేశాల మేరకు కేసు నమోదు చేసింది ఏపీ సిఐడి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ పదోన్నతి కోసం గానూ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ ని ఆయన సమర్పించారని అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి.

దీనిపై విచారణ జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సర్టిఫికెట్లో టైప్ మిస్టేక్ ఉందని నిర్ధారించి ఫిర్యాదు క్లోజ్ చేసింది. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు లోకాయుక్తకు తాజాగా ఫిర్యాదు చేయడంతో మరోసారి ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన లోకాయుక్త గతంలో జరిగిన వ్యవహారాలను కూడా పరిశీలించి కేసు నమోదు చేయాలంటూ ఏపీ సిఐడి అధికారులను ఆదేశించింది.

లోకాయుక్త ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిఐడి అధికారులు అప్పట్లో వచ్చిన ఫిర్యాదు ఏంటి…? ఆ తర్వాత జరిగిన విచారణ ఏ విధంగా జరిగింది ఏంటి అనే అంశాలకు సంబంధించి విచారణ ప్రారంభించారు. అయితే ఈ అంశానికి సంబంధించి అశోక్ బాబు ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతగా తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో ఆయన పైకి వచ్చారని ఆ తర్వాత టిడిపి లోకి వెళ్లి ఎమ్మెల్సీగా మంత్రిపదవి కూడా ఆశించారని అప్పట్లో చాలామంది ఉద్యోగులు ఆయనపై ఆరోపణలు కూడా చేశారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామం తో తెలుగుదేశం పార్టీ మరోసారి ఆశ్చర్యపోయింది.