iDreamPost
android-app
ios-app

CID నటుడికి గుండె పోటు.. ICUలో చికిత్స

బుల్లితెరపై సుమారు 20 ఏళ్ల పాటు అలరించిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ సీరియల్ సీఐడీ. ఈ సీరియల్ చూసిన పెద్దలు, పిల్లలను బాగా ఆకర్షించింది. ఈ సీరియల్ క్యారెక్టర్ అభిజిత్, దయా పేర్లు అందరికీ గుర్తుండిపోతాయి. వారితో పాటు మరో నటుడు కూడా..

బుల్లితెరపై సుమారు 20 ఏళ్ల పాటు అలరించిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ సీరియల్ సీఐడీ. ఈ సీరియల్ చూసిన పెద్దలు, పిల్లలను బాగా ఆకర్షించింది. ఈ సీరియల్ క్యారెక్టర్ అభిజిత్, దయా పేర్లు అందరికీ గుర్తుండిపోతాయి. వారితో పాటు మరో నటుడు కూడా..

CID నటుడికి గుండె పోటు.. ICUలో చికిత్స

బుల్లితెర పై చాలా ఏళ్లుగా కొనసాగుతూ.. విశేష ఆదరణ పొందిన సీరియల్ ఏదీ అంటే ఠక్కున చెప్పే పేరు ‘CID’. అంతలా ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన క్రైమ్ అండ్ సస్పెన్షనల్ టీవీ సిరీస్ సీఐడీ హిందీలోనే కాదూ తెలుగులోనూ అలరించింది. హిందీలో సోనీ టీవీలోనూ, తెలుగులో స్టార్ మా లోనూ ప్రసారం అయిన సంగతి విదితమే. ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసేవారున్నారు. చిన్న పిల్లలకు కూడా ఈ సీరియల్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ సీరియల్ నటించిన ఆఫీసర్లంతా ఎంత పాపులర్ అయ్యారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సీరియల్ నటించిన ఓ నటుడు తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రి పాలైయ్యాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దాదాపు 20 ఏళ్ల పాటు తిరుగులేని సీరియల్‌గా పేరుపొందిన ‘CID’లో కామెడీ పోలీసు అధికారిగా ఫ్రెడరిక్స్ పాత్రలో కనిపించిన నటుడు దినేష్ ఫడ్నిస్. ఆయన తాజాగా గుండెపోటుకు గురయ్యారు. డిసెంబరు 1న ఆయనకు గుండెపోటు వచ్చిందని.. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని తుంగా ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందుస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఆరోగ్యం గురించి లెటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దినేష్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని అన్నారు. దినేష్ శరీరం చికిత్సకు స్పందిస్తుందని.. దినేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అన్నారు.

కాగా, 57 ఏళ్ల దినేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన షూట్స్ అప్డేట్స్‌తో పాటు.. వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట అభిమానులతో పంచుకుంటారు. అలాగే తన ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1980లో ప్రారంభమైన సీఐడి షో.. దాదాపు 20 ఏళ్లు బుల్లితెర పై విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే!. అయితే దినేష్.. సిఐడి వంటి హిట్ సీరియల్‌తో పాటు.. తారక్ మెహతాగా ఉల్టా చష్మా సీరియల్ లోనూ అతిథి ప్రాత్రలో నటించాడు. అంతేకాకుండా.. దినేష్ సర్ఫరోష్, సూపర్ 30 సహా పలు హిందీ చిత్రాల్లో నటించి అలరించాడు. ఇక దినేష్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషలు మీడియా వేదికగా కోరుకుంటున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.