iDreamPost
android-app
ios-app

నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరుని అవుతా, ‘వాల్తేరు వీరయ్య’ నుంచి మరో ఆణిముత్యం

  • Published Dec 10, 2022 | 8:11 PM Updated Updated Dec 10, 2022 | 8:11 PM
  • Published Dec 10, 2022 | 8:11 PMUpdated Dec 10, 2022 | 8:11 PM
నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరుని అవుతా, ‘వాల్తేరు వీరయ్య’ నుంచి మరో ఆణిముత్యం

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని సాంగ్స్ కి, స్టెప్పులకి ఉండే క్రేజే వేరు. 20 ఏళ్ళ క్రితం నాటి సాంగ్స్ కూడా ఇప్పటికీ కిక్ ఇస్తాయి. కానీ ఆయన సినిమాల్లోని లేటెస్ట్ సాంగ్స్ మాత్రం ట్రోల్ మెటీరియల్ లా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ నుంచి సాంగ్స్ విడుదలవుతున్నాయంటే ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు.

బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. గతంలో చిరు-డీఎస్పీ కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ రావడంతో.. ఈ మూవీలోని సాంగ్స్ కూడా అదిరిపోతారని ఫ్యాన్స్ భావించారు. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘బాస్ పార్టీ’ అనే సాంగ్ వస్తుందని ప్రకటించినప్పుడు తెగ సంబరపడ్డారు. తీరా సాంగ్ విడుదలయ్యాక “నువ్వు లుంగీ ఎత్తుకో.. నువ్వు షర్ట్ ముడేసుకో” అనే లిరిక్స్ విని అవాక్కయ్యారు. ఆ సాంగ్ మీద, ఆ లిరిక్స్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. మెగాస్టార్ రేంజ్ కి తగ్గ సాంగ్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.

ఇక ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లోని మిగతా సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో చిరంజీవి, హీరోయిన్ శృతి హాసన్ పై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఆ సాంగ్ లోని లిరిక్ “నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరుని అవుతా” అంటూ సాగుతుందట. ఒకప్పుడు చిరంజీవి పాటలంటే అందరూ పాడుకునేలా ఉండేవి.. కానీ ఇప్పుడు బాస్, చిరు అనే పదాలను అనవసరంగా ఇరికిస్తున్నారని.. ట్యూన్స్ గానీ, లిరిక్స్ గానీ ఆయన రేంజ్ కి తగ్గట్లుగా లేవని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “లుంగీ ఎత్తుకో.. షర్ట్ ముడేసుకో” వంటి లిరిక్స్ తో ఆయన రేంజ్ ని తగ్గించే ప్రయత్నం చేయొద్దని అంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom