iDreamPost
iDreamPost
ఈమధ్య రాజకీయాలకు దూరంగా, అందరివాడుగా ఉంటున్న చిరంజీవి, ట్విట్టర్ లో రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు దూరంకాలేదన్నది ఆయన ట్వీట్ సారాంశం. చిరంజీవి వాయస్ పది సెకండ్ల ఆడియాలో క్లిప్ లో ఏమున్నందంటే..నేను రాకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కాని, రాజకీయాలు నానుంచి దూరంకాలేదు. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనమైంది. రాజకీయాలతో తనకు అనుబంధం ఉంటుందని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమైఉంటున్నది చర్చకు దారితీసింది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022
ఆయన మీద బీజేపీ కన్ను ఉంది. జనసేన తమవాడని అంటోంది. కాని చిరంజీవి సీఎం జగన్ కు సన్నిహితంగా ఉంటున్నారు. కొద్దికాలం క్రితం సీఎం అభ్యర్ధిగా బీజేపీ చిరంజీవిని ప్రకటించవచ్చన్న ప్రచారం జరిగింది. కాని చిరు రాజకీయాలపై ఆసక్తి చూపించలేదు. మరి అలాంటి చిరు ఇప్పుడు రాజకీయాలపై కామెంట్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ఈ ఆడియో క్లిప్ గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగని అంటున్నారు. అయినా సినిమాలో చాలా డైలాగ్స్ ఉంటాయి. అందులో ఏరికోరి ఎందుకు ఈ పొలిటికల్ డైలాగ్ ను ఎందుకు షేర్ చేస్తారు?