డిజాస్టర్ గురించి మెగాస్టార్ కామెంట్స్

నేరుగా సినిమా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ప్రసంగంలో అన్న మాటలను బట్టి అది దేని గురించో అందరికీ అర్థమయ్యింది.

నేరుగా సినిమా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ప్రసంగంలో అన్న మాటలను బట్టి అది దేని గురించో అందరికీ అర్థమయ్యింది.

చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య ఫలితం మీద మాట్లాడారు. నేరుగా సినిమా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ప్రసంగంలో అన్న మాటలను బట్టి అది దేని గురించో అందరికీ అర్థమయ్యింది. నిన్న జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కంటెంట్ ఉంటే తప్ప జనం థియేటర్లకు రావడం లేదని, రెండో రోజే ఖాళీగా చూడాల్సి వస్తోందని, తానే ఈ మధ్య బాధితుడిగా మారానని పరోక్షంగా ఆచార్య గురించి అన్నారు. దర్శకులు కేవలం కాంబినేషన్లను నమ్ముకుని భారీ తారాగణం దొరికింది కదాని స్క్రిప్ట్ మీద హోమ్ వర్క్ చేయకపోతే దాని వల్ల తీవ్ర నష్టం ఉంటుందని హెచ్చరించారు.

ఇదంతా కొరటాల శివను ఉద్దేశించని వేరే చెప్పనక్కర్లేదు. సరే బాధ్యులు ఎవరైతేనేం చిరు హుందాగా తన ఫెయిల్యూర్ ని ఒప్పుకోవడం విశేషం.సుప్రసిద్ధ పూర్ణోదయా సంస్థ నిర్మించిన ఫస్ట్ డే ఫస్ట్ షో రేపు విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఖుషి మొదటి రోజు బెనిఫిట్ షో టికెట్లు సంపాదించాలనుకున్న ఓ కుర్రాడు పడే పాట్లను జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ఓ కథగా రాశారు. అదే ఈ మూవీ. దర్శకత్వం చేయకపోయినా అన్నీ తానై చూసుకున్నాడు. ట్రైలర్ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది కానీ ఇతర హీరోల అభిమానులకు ఇది ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. రంగ రంగ వైభవంగా, బుజ్జి ఇలారాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రేపు పోటీ పడుతున్నాయి.


ఇక చిరంజీవి కామెంట్స్ లోని పరమార్థాన్ని విశ్లేషించాల్సిన అవసరమైతే చాలా ఉంది. కథా కథనాలకు సంబంధించిన లోపాలను హీరోల మీదకు తోసేయలేమన్నది వాస్తవం. కొన్నిసార్లు చర్చల్లో వాళ్ళ ప్రమేయం ఉన్నప్పటికీ అంతిమంగా బాధ్యత వహించాల్సింది మాత్రం దర్శకుడే. గతంలో వినయ విధేయ రామ టైంలోనూ రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఒక పబ్లిక్ నోట్ విడుదల చేశాడు. బోయపాటి శీనుని ఇది ఇబ్బంది పెట్టే పరిణామమే అయినా తప్పలేదు. ఇప్పుడు చిరు ఇలా స్టేజి మీద అనేశారు. సీతారామం, కార్తికేయ 2, బింబిసారలను ఉదాహరణగా చెప్పిన మెగాస్టార్ మరి గాడ్ ఫాదర్ తో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి

Show comments