iDreamPost
android-app
ios-app

రంగంలోకి దిగుతున్న నారప్ప, ఆచార్యలు

  • Published Nov 04, 2020 | 6:59 AM Updated Updated Nov 04, 2020 | 6:59 AM
రంగంలోకి దిగుతున్న నారప్ప, ఆచార్యలు

మొన్నటి దాకా షూటింగ్ ఎప్పుడు రీ స్టార్ట్ చేస్తారో క్లారిటీ లేని సినిమాలు రెండు ఆచార్య, నారప్పలు రంగంలోకి దిగబోతున్నాయి. రేపటి నుంచి వెంకటేష్ కొద్దిరోజుల పాటు హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో జరిపే చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. ఇందులో ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. ఆ తర్వాత అవుట్ డోర్ ఎక్కడ ప్లాన్ చేశారన్నది తెలియాల్సి ఉంది. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న నారప్ప తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ కు అఫీషియల్ రీమేక్. ప్రియమణి వెంకీకి జోడిగా నటిస్తుండగా మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇక మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య కూడా ఈ నెల 9 నుంచి పునఃప్రారంభం కాబోతున్నట్టు తెలిసింది. రామోజీ ఫిలిం సిటీలోనే కంటిన్యూ చేయొచ్చు.ఇంకా చాలా భాగం పెండింగ్ ఉన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లోనే తన ఎంట్రీ ఉంటుందా లేక కొంత ఆలస్యంగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ఉన్నాడు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరిగిన ఆచార్య లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ దసరాకే వచ్చేది. ఇప్పుడు 2021 సమ్మర్ ని ఫిక్స్ చేసుకున్నారు. కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ చిరంజీవితో జతకడుతుండగా దీనికీ మణిశర్మే సంగీతం.

ఈ ఇద్దరితో కలిపి అందరు సీనియర్ హీరోలు సెట్స్ లోకి వచ్చేసినట్టే. నాగార్జున వైల్డ్ డాగ్ కోసం నెల రోజుల ముందే బిజీ అయ్యాడు. బాలకృష్ణ ఇటీవలే బోయపాటి శీను సినిమా కోసం మేకప్ వేసుకున్నారు. రాజశేఖర్ కు అసలు ప్రాజెక్టే ఫైనల్ కాలేదు. అందులోనూ ఆనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు కాబట్టి ఇప్పుడప్పుడే కొత్త సినిమాలు మొదలుపెట్టే అవకాశం లేదు. ఏడు నెలలు కళావిహీనంగా ఉన్న స్టూడియోలు క్రమక్రమంగా సందడితో నిండుతున్నాయి. దాదాపు టాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఎవరి సినిమాల్లో వాళ్ళు లాక్ అయిపోయారు. అందరూ కోరుకున్నది కూడా ఇదే. ఇదే కొనసాగాలి కూడా. జనవరి నుంచి థియేటర్లలో కూడా ఈ హడావిడి చూడాలి. అదొక్కటే ఆలస్యం.