iDreamPost
android-app
ios-app

సిఎం తండ్రి అరెస్ట్… సిఎం రియాక్షన్ అదుర్స్…!

సిఎం తండ్రి అరెస్ట్… సిఎం రియాక్షన్ అదుర్స్…!

రాజకీయాల్లో విలువలు అనేవి ఈ మధ్య కాలంలో బూతద్దం పెట్టి వెతికినా దొరికే పరిస్థితి ఉండదు అనే మాట వాస్తవం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రధానంగా పాలకుడిగా ఉన్న సమయంలో మన వాడు ఏది చేసినా సరే చూసి చూడకుండా వదిలేస్తాం. ప్రత్యర్ధులు రాజకీయ విమర్శలు చేసిన సమయంలో దానికి సమాధానం ఘాటుగా ఇస్తాం… విచారణలు, న్యాయస్థానాలు, చట్టాలు అంటూ ఏదో అర్ధం లేని సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే పాలక పార్టీల్లో ఇది జరుగుతూనే ఉంటుంది.

కాని మన పొరుగున ఉన్న చత్తీస్ఘడ్ లో మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. ఒక సామాజిక వర్గాన్ని అవమానించారు అనే కారణంతో పోలీసులు ఏకంగా సిఎంనే అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం అయింది. సిఎం పదవి నుంచి తప్పుకోవాలని… సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సిఎం భూపేష్ భాఘెల్… చేసిన పనికి ఆయన ప్రత్యర్ధులు కూడా షాక్ అయ్యారు. ఔరా అనే విధంగా ఆయన అడుగు వేసారు. అసలు ఏం జరిగింది ఏంటీ అనేది ఓ సారి చూస్తే..

భూపేష్ బాఘెల్ తండ్రి నంద కుమార్ బాఘెల్‌ బ్రాహ్మణులను అవమానించారని ఫిర్యాదు నమోదు అయింది. ఈ ఫిర్యాధుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోర్ట్ తీసుకెళ్లగా 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌ లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ మేరకు ఆయనపై ఫిర్యాదు చేసింది. బ్రాహ్మణులు బయటివారని, విదేశీయులని మాట్లాడుతూ… తమను తాము బ్రాహ్మణులూ సంస్కరించుకోవాలని, లేదంటే మాత్రం గంగ నుంచి వోల్గాకు వెళ్ళడానికి సిద్ధం కావాలీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

ఆయన మాట్లాడిన క్లిప్ ఆధారంగా… పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు. దీనిపై డీడీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి గా యోగిత కపర్దే మీడియాకు వివరాలు చెప్పారు. సిఎం తండ్రి… నంద కుమార్ సమాజంలో విద్వేషాలను వ్యాపింపజేస్తున్నారన్నారు. అలాగే ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని బ్రాహ్మణులు ఫిర్యాదు చేసారని పేర్కొన్నారు. అందుకే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇక తన తండ్రి అరెస్ట్ పై భూపేష్ భాఘెల్ స్పందించారు. తన తండ్రి అంటే తనకు అమితమైన గౌరవం అని… కాని తన ప్రభుత్వంలో ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేస్తూ ప్రజల భద్రతకు భంగం కలిగించే ఈ తరహా వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదన్నారు.