మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న చెవిరెడ్డి

చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తానున్నానంటూ చెవిరెడ్డి ముందుకు వచ్చారు.

ఇప్పటికే తన నియోజకవర్గంలోని ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని పోలీసు, వైద్య, శానిటేషన్, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లకు నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు. బియ్యము, 25 రకాల నిత్యవసర సరుకులు తో కూడిన ప్యాకెట్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారందరికీ అందిస్తామన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసు, వైద్య, శానిటేషన్, గ్రామ సచివాలయం, వాలంటీర్లు మొత్తం 11 వేల మంది ఉన్నారు. వీరందరికీ 1.60 కోట్ల రూపాయల విలువైన వస్తువులు అందిస్తున్నారు. పంచాయతీ కార్యాలయానికి పోలీస్ స్టేషన్లు కు, ఆస్పత్రులకు వస్తువులు పంపించి సంబంధిత సిబ్బందికి అక్కడే అందజేస్తున్నారు. మరికొంతమందికి వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు మరింత చేయూతనిచ్చేందుకు చెవిరెడ్డి ఈ ప్రణాళిక రచించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ కుటుంబానికి డజను కోడిగుడ్లు చొప్పున పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పది కేజీల చొప్పున కూరగాయలు పంపిణీ చేయాలని సంకల్పించారు. ఈ కార్యక్రమం తర్వాత సి విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకొచ్చారు. ఆయన తర్వాత మరికొందరు శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు వీలైనంత సహాయం చేసేందుకు సంకల్పించారు.

Show comments