iDreamPost
android-app
ios-app

Kuppam.elections Chandrababu -మునిసిపాలిటీ ప్ర‌చారానికి మాజీ ముఖ్య‌మంత్రి?

Kuppam.elections Chandrababu -మునిసిపాలిటీ ప్ర‌చారానికి మాజీ ముఖ్య‌మంత్రి?

ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తేంటి.. మున్సిపాలిటీలో గెలుపు కోసం నేరుగా ప్ర‌చారానికి రావ‌డం ఏంటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఏం చేస్తాం.. ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా త‌ప్పేలా లేద‌న్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ మున్సిపాలిటీ ఏడు సార్లుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనిది. సాధార‌ణంగా అయితే.. ప‌ద్నాలుగేళ్లు ముఖ్య‌మంత్రిగా, ఏడు సార్లు ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా కొన‌సాగిన ఆ వ్య‌క్తి క‌నుసైగ చేస్తే.. మున్సిపాలిటీలో గెలుపు కైవ‌సం కావాలి. కానీ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి బాగోలేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు దిగిరాక త‌ప్ప‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల చేదు అనుభ‌వాల నేప‌థ్యంలో కుప్పం మున్సిపాలిటీ గెలుపు కోసం స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌చారానికి రెడీ అవుతున్న‌ట్లుగా పార్టీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.

చంద్ర‌బాబుకు న‌మ్మ‌కం లేదా?

ఎన్నిక ఏదైనా.. చంద్ర‌బాబు సొంత నియోజకవర్గం కుప్పం లో కూడా టీడీపీకి చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చంద్రబాబు ఇలాకాలో కూడా వైసీపీ అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. దీంతో టీడీపీపై తీవ్ర చ‌ర్చ మొద‌లైంది. చివ‌ర‌కు బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో నియోజ‌క‌వ‌ర్గాన్ని చూసుకుంటున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు కుప్పం మునిసిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కుప్పం ని మునిసిపాలిటీగా చేశారు. అది ఆ ప్రాంతవాసుల చిరకాల డిమాండ్ కూడా. తెలుగుదేశం అధికారంలో ఉండ‌గా సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క ప్రాంతాన్ని చంద్ర‌బాబు మున్సిపాల్టీగా మార్చుకోలేక‌పోయారు. జ‌గ‌న్ వ‌చ్చాక మార్పు వ‌చ్చింది. అభివృద్ధిలో కూడా దూసుకెళ్తోంది. దీంతో అక్క‌డ గెలుపుపై చంద్ర‌బాబునాయుడుకు న‌మ్మ‌కాలు బ‌లంగా లేన‌ట్లుగా క‌నిపిస్తోంది. అక్క‌డ‌ ఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా పేరు న‌మోదు చేసుకోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు.

బాబేంటి.. మున్సిపాల్టీలో ప్ర‌చార‌మేంటి?

కుప్పం ను మున్సిపాలిటీగా మార్చిన వైసీపీ కూడా గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. జ‌గ‌న్ పాల‌న‌ను, స్థానికంగా చేసిన అభివృద్ధి ప్ర‌ధాన ఎజెండాగా ప్ర‌చారం చేస్తోంది. మున్సిపాలిటీలో కూడా పాగా వేసి చంద్రబాబుకు ఘోర పరాభవం ఏంటో చూపించాలని కంకణం కట్టుకుంది. దీంతో జాతీయ నేత‌గా ఉన్న చంద్ర‌బాబే టీడీపీ నుంచి రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో వరసబెట్టి ఓడి పోతోంది. ఆ ఓటమి చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం దాకా వ‌చ్చేయ‌డంతో కుప్పం మున్సిపాల్టీ లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం సాధించాల‌ని బాబు సంక‌ల్పించుకున్నారు. కనీసం మునిసిపాలిటీ అయినా దక్కించుకోకపోతే క్యాడర్ కి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తాయని కూడా పార్టీ భయపడుతోంది. ప్ర‌స్తుతానికి చంద్రబాబు వ‌ర్చువ‌ల్ గానే క‌థ అంతా న‌డిపిస్తున్నా.. త్వ‌ర‌లోనే కుప్పం టూర్ కి రెడీ అవుతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాబేంటి.. మున్సిపాల్టీలో ప్ర‌చారం ఏంటి అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Also Read : Chandrabbu Tdp – 14 ఏళ్లు సీఎం.. ఇప్పుడు కుప్పంలో ఎక్స్ ఆఫీషియో మెంబర్!