iDreamPost
android-app
ios-app

ల్యాండర్ పంపిన చంద్రుడి ఉపరితలం ఫొటోలు ఇవే!

ల్యాండర్ పంపిన చంద్రుడి ఉపరితలం ఫొటోలు ఇవే!

యావత్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రయాన్-3 ప్రయోగం ఎట్టకేలకు విజయం సాధించింది. చంద్రుడి దక్షిణ ధృవంలో జెండా పాతిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రలో పుటల్లో నిలిచిపోతుంది. ఈ ఘనమైన కీర్తిని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు సంభరాలు జరుపుకుంటున్నారు. ఈ అద్భుతమైన ఘట్టంపై దేశ ప్రధాని నరేంద్ర మోడి స్పందించి ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షల తెలియజేశారు.

అయితే ఈ సమయంలోనే విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపి మొట్టమొదటి చిత్రాలను ఇస్రోకు పంపించింది. హారిజంటల్ వెలాసటీ నుంచి వర్టికల్ వెలాసిటీకి మారే క్రమంలో చంద్రుడి 6 కి.మీ దూరం నుంచి ఈ ఫోటోలు పంపినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ఇవే ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో విక్రమ్ పంపిన చంద్రుడి ఉపరితలం ఫొటోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ శాస్త్రవేత్తల పని తీరును మెచ్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్.. ఇస్రో చేసిన తొలి ట్వీట్ ఏంటంటే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి