iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు మళ్లీ షాక్.. రిమాండ్ పొడగించిన ACB కోర్టు!

చంద్రబాబుకు మళ్లీ షాక్.. రిమాండ్ పొడగించిన ACB కోర్టు!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు ఏసీబీ కోర్టులో భారీ  షాక్ తగిలింది. స్కిల్ స్కామ్ కేసులో ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది.  నవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వూలు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ్టితో చంద్రబాబు రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1 వరకు పోడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో సెక్యూరిటీ విషయంలో అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు..జడ్జీకి తెలిపారు.  అయితే ఏమైనా అనుమాలుంటే రాతపూర్వంగా ఇవ్వాలని జడ్జీ తెలిపారు. ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును వర్చువల్ గా జైలు అధికారులు హాజరుపర్చారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  ఆయనకు ఇప్పటికే పలుమార్లు ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగిస్తూ వచ్చింది. ఇటీవలే పొడగించిన రిమాండ్ గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వర్చువల్ విధానంలో చంద్రబాబును  ఏసీబీ కోర్టు ముందు జైలు అధికారులు హాజరు పరిచారు. విచారణ సమయంలో తన ఆరోగ్యం, భద్రత గురించి జడ్జి ఎదుట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమయంలో ఆరోగ్యం ఎలా ఉంది? అని చంద్రబాబును ఏసీబీ జడ్జి ఆరా తీశారు.

అయితే తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని ఆయన న్యాయమూర్తికి తెలిపారు. దీంతో అధికారుల్ని జడ్జి వివరణ కోరారు. వైద్య బృందం ఉందని, ఎప్పటికప్పుడు ఆయనకు వైద్యపరీక్షలు జరుపుతోందని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. మెడికల్‌ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశిస్తూ.. చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1కి పొడిగించారు. భద్రత విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పడంతో.. ఏమైనా అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు సూచించింది. అలాగే చంద్రబాబు రాసే లేఖను సీల్‌ చేసి తనకు పంపాలని అధికారుల్ని న్యాయమూర్తి ఆదేశించారు. మరి… ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ ను పొడగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి