iDreamPost
android-app
ios-app

ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు రామతీర్థం పర్యటన.

ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు రామతీర్థం పర్యటన.

ఊరకరారు మహానుభావులు.. వారు వచ్చారంటే ఏదో పాయింట్ ఉండే ఉంటుంది. కోవిడ్ పేరు చెప్పి ఆర్నెళ్లుగా రాష్ట్రనికి దూరంగా ఉంటూ వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనకు మైలేజీ దక్కేందుకు అవకాశం ఉందన్న ఆశతో విజయనగరం జిల్లా రామతీర్థానికి వచ్చారు. దుండగుల దాడిలో దెబ్బతిన్న కోదండ రాముని విగ్రహం శిరస్సు భాగం సమీపంలోని కోనేట్లో దొరకడం, వెనువెంటనే ఆలయాన్ని పునరుద్ధరించి విగ్రహ మూర్తులను పునఃప్రతిష్ట చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినప్పటికీ ఈ విషయం ఇక్కడితో చల్లారితే మళ్ల ఇంకో పాయింట్ దొరకదు అని భావించిన చంద్రబాబు ఆఘమేఘాల మీద రామతీర్థం గుట్టకు చేరుకున్నారు.

యథావిధిగానే తన అక్కసును మాటల్లో వెళ్లగక్కారు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని రావణుడితో పోల్చారు. శాపనార్థాలు పెట్టారు. తన పాలనలో
పదుల సంఖ్యలో ఆలయాలను ధ్వంసం చేసిన సంగతిని మరిచిన చంద్రబాబు ఇప్పుడు దుండగులు చేసిన దుశ్చర్యను ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రజల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టేందుకు శతథా యత్నించారు. చంద్రబాబు పర్యటనకు ముందే టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రామతీర్ధంలోని బోడికొండ వద్దకు చేరుకున్నారు. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖ ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లి చలద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు, అనంతరం ఆయన కార్యకర్తలతో కలిసి గుట్టమీదకు ఎక్కి కోదండ రాముని ఆలయాన్ని పరిశీ లించేందుకు ప్రయత్నించగా దేవాదాయ శాఖ, పోలీసులు అనుమతిని నిరాకరించారు, కేసు దర్యాప్తులో ఉన్నందున లోనికి ఎవర్నీ పంపేది లేదని స్పష్టం చేయడంతో చంద్రబాబు అక్కడే ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

పలు ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోయిన ఘటనల్లోనూ, ఇంకా ఘాతుకాలు జరిగిన తరుణంలోనూ ఇల్లు కదలని చంద్రబాబు ఈ రామతీర్థం అంశం మీద మాత్రం ఆఘమేఘాల మీద ఇక్కడికి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపాందేందుకు యత్నించారు ఆయన రాకకు ముందే వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే ఆలయానికి వచ్చి పరిస్థితులను పరిశీలించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఆ ఘటనకు సంబంధించి అనుమానితులు పలువుతిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఒకరిద్దరు తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతిపరులు ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇవేవీ పోలీసుసు వెళ్లదించడం లేదు. త్వరలోనే నిందితులను వెల్లడిస్తామని ఎస్సీ బి.రాజకుమారి వివరించారు. పోలీసుల అదుపులో ఉన్న ఓ అనుమానితుడు చెబుతున్న వివరాలను పరిశీలిస్తే ఆయనకు ఈ అఘాయిత్యంతో సంబంధం ఉన్నట్లుగా అనుమానం ఉందని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటన అటు ప్రభుత్వానికి సవాల్గా పరిణమించగా ప్రతిపక్షానికి మాత్రం ఓ అవకాశంగా మారింది. ఇది ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడ ఆనుతుందో చూడాలి.

రామతీర్థం చైర్మన్ గా అశోక్ తొలగింపు

రామతీర్థంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత రామతీర్థంలో ని
రామస్వామి ఆలయానికి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ గా కొనసాగుతుండగా ఆయన్ను ఆ పదవినుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందడం, కోదండ రాముని ఆలయం లో విగ్రహం ధ్వంపం కావడం వంటి అనాంఛనీయఘటనలకు ఆయన్ను బాధ్యున్ని చేస్తూ ఆశోక్ మ ఆ పదవి నుంచి తొలగించారు. దీంతోబాటు తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లిలోని మందేశ్వరి ఆలయ చైర్మన్ పదవి మంచి కూడా అశోక్ ను తొలగిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి