Idream media
Idream media
ఆలయాలపై దాడులు ఈ ఏడాదే తక్కువ జరిగినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. దీంతో ఎప్పుడూ లేనంత రాద్దాంతం ఈ సారే ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్వేదిలో కొత్త రథాన్ని తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. పూర్తి శాస్త్రోక్తంగా రథం తయారీకి ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. అంతేకాదు.. రథం దగ్దంపై ఏపీ ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇంతకంటే చిత్తశుద్ధి ఏం కావాలి. చంద్రబాబు హయాంలో ఓ రథం దగ్ధమైతే దాని మీద ఓ ప్రకటన కూడా వెలువడిన దాఖలాలు లేవు. ఇటువంటి చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంటే.. ఒకే విధానంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న బీజేపీ కూడా విస్మయం వ్యక్తం చేస్తోంది. మత సామరస్యానికి ప్రతీకలా ఉండే రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే తప్ప తన పాచికలు పారవనే ఉద్దేశంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారా..? అనే అనుమానాలకు జరుగుతున్న సంఘటలన్నీ బలం చేకూరుస్తున్నాయి. వినాశకర ఘటనల తాలూకు విధ్వంసం చల్లారకుండా పదే పదే వాటిపై మాట్లాడడం వెనక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదే బాబు వ్యూహం అయితే..
అంతర్వేది తో ఆగకుండా తిరుమల డిక్లరేషన్ మీద కూడా చంద్రబాబు రాద్దాంతం చేయించారు. చిత్తూరులో శ్రేణులను బలవంతంగా ఉసిగొలిపారు. దీనికోసం ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉండే కొందరిని అవసరార్థం తెరమీదికి తెస్తున్నట్లు కనిపిస్తోంది. టీటీడీ ని కాగ్ పరిధిలోకి తీసుకుపోవడంతో తాను దోచుకున్న నిధుల సంగతి బయటపడుతుందేమోనని చంద్రబాబు భయం. అందుకే.. డిక్లరేషన్‌ను తన రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. మత పరంగా రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలను ప్రజలను పరిశీలిస్తూనే ఉన్నారు. అవన్నీ ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్లుగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అందుకే ఆ రాజకీయాలకు తాము పావులు కావొద్దని అంతర్వేది ఘటన అనంతరం గుర్తించిన చాలా మంది పెద్దగా స్పందించడం లేదు. మత పరమైన రాజకీయాలు చేయడమే బాబు ఉద్దేశ్యమైతే ఇప్పటికైనా వాటికి అడ్డుకట్ట వేయకపోతే ఆయనకే ప్రమాదమని గుర్తించాలి.