Idream media
Idream media
తాను చేయకపోయినా.. తానే చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు ‘నేనే చేశాను’ అని బలంగా చెప్పుకునే బంగారం లాంటి అవకాశం మిస్ అయింది. మిస్ అయింది అనడం కన్నా.. మిస్ చేసుకున్నారనడం సబబుగా ఉంటుంది. అది మరేదో కాదు విజయవాడలోని కనకదుర్గ ప్లైఓవర్. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ లాంటి నగరాలనే నిర్మించిన చంద్రబాబుకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం మాత్రం సాధ్యం కాలేదు.
రాజధానిగా అమరావతితోపాటు కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు ఒకే సారి ప్రారంభం అయింది. బాబు దిగిపోయే నాటికి అమరావతి ఇంకా డిజైన దశలోనే ఉండగా.. కనకదుర్గ ఫ్లై ఓవర్ పిల్లర్ల స్టేజ్‌కు వచ్చింది. అంతా నేనే చేశానని చెప్పుకునే చంద్రబాబు.. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని కడతానని డాంభికాలు పలికిన విజనున్న నేత చిన్నపాటి ఫ్లై ఓవర్‌ను ఐదేళ్లలో కూడా పూర్తి చేయలేకపోయారన్న విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం వచ్చాక అటు సంక్షేమంతోపాటు ఇటు అభివృద్ధి పనులను ఏ మాత్రం ప్రచార ఆర్భాటం లేకుండా చేసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ఏడాదిలోనే సిద్ధం చేశారు. వచ్చే నెల 4వ తేదీన ఈ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. తన హాయంలో నిర్మించని శంషాబాద్ విమానాశ్రయం, హైదరాబాద్ రింగ్‌రోడ్డు, హైటెక్ సిటీలను తానే నిర్మించానని చెప్పుకునే చంద్రబాబు.. తాను శంకుస్థాపన చేసిన కనకదుర్గ ఫ్లై ఓవర్ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సంచయిస్తున్నారు.
కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను తానే కట్టానని చెబుదామనుకుంటే.. బాబు దిగిపోయే నాటికి ఫ్లై ఓవర్ పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు బాగా తెలుసునాయే. కనీసం తాను శంకుస్థాపన చేశానని కూడా చెప్పుకునేందుకు బాబుకు ధైర్యం చాలడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఐదేళ్లలో చిన్న ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయలేని వాడివి.. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఎప్పుడు అవుతుందనే ప్రశ్న అందరి నంచి వినిపిస్తుంది. ఇది చివరికి ప్రస్తుతం తాను చేస్తున్న అమరావతి ఉద్యమానికి పెద్ద నష్టం చేకూరుస్తుందన్న భావనలో బాబు ఉన్నట్లు కనిపిస్తోంది.
గుడ్డిలో మెల్ల అన్నట్లుగా.. విజయవాడ ఎంపీగా నాని గెలిచాడు. బాబు మౌనంగా ఉన్నా.. నాని మాత్రం కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ క్రెడిట్‌ను పూర్తిగా తమ ఖాతాలో వేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయనే స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారినీ ఆహ్వానించారు కూడా. తరచూ ఫ్లై ఓవర్‌ను పరిశీలిస్తూ తమ అనుకూల మీడియాకు న్యూస్ ఫీడ్ అందిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇప్పుడు మౌనంగా ఉన్నా.. రాబోయే రోజుల్లో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను తానే నిర్మించానని చెప్పుకుంటారని ఆయన తీరును ఆది నుంచి గమనిస్తున్న వారు చెబుతున్నారు.