Idream media
Idream media
2014 ఎన్నికల ప్రచారంలో మీరు బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దు ,నేను అధికారంలోకి వచ్చి మీ రుణాలన్నీ నయా పైసలతో తీరుస్తాను అని ఊరు ఊరు తిరిగి ప్రహకారం చేసిన చంద్రబాబుకు ఆ ఎన్నికల్లో రైతుల ఆదరణ దక్కింది. అధికార పీత ఎన్నిక తరువాత రుణ మాఫీ మీద అధ్యయనానికి కమిటీ వేసిన రోజే రుణ మాఫీ జరగదు అని రైతులకు అర్ధమయ్యింది.
చివరికి విడతల వారీగా రుణ మాఫీ అని 2019 ఎన్నికల నాటికి నాలుగు మరియు ఐదు విడతల మాఫీకి ముందస్తు చెక్కులు ఇస్తానని హడావుడి చేసి చివరికి చెక్కులు కూడా ఇవ్వలేదు. అంటే ఐదేళ్ళలో మూడు విడతల కింద 15 వేల కోట్ల రుణ మాఫీ చేశాడు . 2014 మే నాటికి మొత్తం రైతుల ఋణం 87,600 కోట్లు. ఐదేళ్ళలో ఇచ్చింది దానిలో కేవలం 17%… ఇది కనీసం వడ్డీ డబ్బుకు కూడా సమానం కాదు.మిగిలిపోయిన రుణ మాఫు మీరు చెయ్యండని చంద్రబాబు కొత్త ముఖ్యమంత్రి జగన్ ను డిమాండ్ చెయ్యటం హైలెట్
రుణమాఫీ అని చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తీరని బ్యాంకు ఋణం రైతులను కుంగదీసిందీ. వాగ్ధానం ఇచ్చి నెరవేర్చకపోవటం ఒక ఎత్తయితే మీకు అన్ని చేశాను అనటం రైతులకు చంద్రబబు పట్ల కసి పెంచింది.. అదే ఓట్ల రూపంలో చంద్రబాబు ఓటమికి దారి తీసింది.