Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హస్తిన పర్యటనలో అన్ని అంశాలు మారిపోయాయి. తన పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్లబోతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం సాగింది. దాడి చేసిన అనంతరం రాష్ట్ర బంద్, ఆ తర్వాత చంద్రబాబు 36 గంటల దీక్ష.. చివరగా.. ఢిల్లీ వెళ్లి అమిత్ షాకు ఫిర్యాదు చేయాలనే ప్లాన్ టీడీపీ వేసుకుంది. ఈ రోజు సాయంత్రంతో చంద్రబాబు 36 గంటల దీక్ష ముగిసింది. అనుకున్న ప్రకారం రేపు శనివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
అయితే చంద్రబాబు టూర్‌లో అన్నీ మారిపోయాయి. హస్తిన వెళ్లాల్సిన రోజు మారిపోయింది. కలవాల్సిన వ్యక్తి మారిపోయారు. కారణాలైమైనా గానీ చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో శనివారం జరగాల్సిన చంద్రబాబు ఢిల్లీ యాత్ర సోమవారానికి వాయిదా పండింది. అమిత్ షా బదులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవాలని బాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని టీడీపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఖరారైందని టీడీపీ అనుకూల మీడియా ఛానెళ్లు బ్రేకింగ్ న్యూస్‌లు వేస్తున్నాయి. దీంతో సోమవారం బాబు హస్తిన పర్యటన జరుగుతుందా..? లేదా..? అనే సందేహాలు తమ్ముళ్లలో నెలకొన్నాయి.
రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతారట..
కలిసే వ్యక్తి మారిపోవడంతో.. చంద్రబాబు డిమాండ్ కూడా మారిపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని, అందుకు టీడీపీ కార్యాలయంపై ఓ పథకం ప్రకారం జరిగిన దాడే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పి.. రాష్ట్రంలో ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) పెట్టాలని చంద్రబాబు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. టీడీపీ కార్యాలయంపై దాడి ఎందుకు జరిగిందనే విషయాన్ని టీడీపీ నేతలు చెబుతారా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.
దీక్ష విరమణ సమయంలో మాట్లాడిన చంద్రబాబు.. ‘‘ సీఎంను, ఆయన తల్లిని తిట్టారని అంటున్నారు. అసలు బోసిడీకే అంటే ఏమిటో నాకు తెలియదు. ఏదో సినిమాల్లో ఆ మాట విన్నాం. దాని అర్థం కూడా నాకు తెలియదు. వీరే దాని అర్థం ఇదీ అంటూ చెబుతున్నారు. అలా అన్నందుకు బీపీ వచ్చిందంట. ఏం మాకు రాదా బీపీ.. ’’ అని చంద్రబాబు తన పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలను సమర్థించారు.
ఆ పదానికి చంద్రబాబుకు అర్థం తెలియకపోయినా రాష్ట్రపతికి తెలుసు. ఉత్తర భారతదేశంలో వాడుకలో ఉన్న ఆ పదం అర్థం ఏమిటో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తప్పక తెలిసే ఉంటుంది. చంద్రబాబు ఫిర్యాదు పట్టుకు వస్తున్నాడని తెలిసిన వెంటే.. పూర్వాపరాలు రాష్ట్రపతి ఖచ్చితంగా విచారిస్తారు. అప్పుడు చంద్రబాబు ఫిర్యాదుపై రాష్ట్రపతి ఎలా స్పందిస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.
Also Read : CBN President Rule -చంద్రబాబు కోరిన వెంటనే రాష్ట్రపతి పాలన విధిస్తారా?