Idream media
Idream media
వైఎస్ జగన్‌సర్కార్‌పై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేసే కొన్ని విమర్శలు చూసినప్పుడు ఆయన గతాన్ని మరిచిపోయారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. అప్పులు, దుబారా ఖర్చులు, ఆర్భాటాలపై చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏపీ ఆవిర్భావం నుంచి 2014 రాష్ట్ర విభజన వరకూ 13 జిల్లాల ఏపీకి వచ్చిన అప్పులు వాటా 90 వేల కోట్ల రూపాయలు అయితే.. చంద్రబాబు 2014– 2019 మధ్య ఐదేళ్లలో కొత్తగా 2.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ మొత్తం దేనికి ఖర్చు చేశారో లెక్కలు లేవు.
అయితే వైసీపీ సర్కార్ అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోందంటూ చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా తోస్తోంది. జగన్ సర్కార్ తెచ్చిన అప్పులను దేనికి ఖర్చు పెడుతుందో లెక్కలు చెబుతోంది. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, శాశ్వత అభివృద్ధి పథకాలు.. ఇలా దేనికి ఎంత ఖర్చు పెట్టామన్నది పత్రికా ప్రకటనల ద్వారా ప్రజల ముందు ఉంచుతోంది.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను, వాటికి అయ్యే ఖర్చులు, ప్రజలకు అందుతున్న నగదు మొత్తాలను గణాంక సహితంగా వివరిస్తూ.. పత్రికలకు ప్రకటనలు ఇవ్వడాన్ని చంద్రబాబు తప్పుబడుతున్నారు. ఇది చంద్రబాబుకు దుబారా ఖర్చులా కనిపిస్తోంది. పేపర్ ప్రకటనల రూపంలో వైసీపీ సర్కార్ ప్రజాధనం దుబారా చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. బాబు నోట ఈ మాట వింటున్న వారు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన దుబారా ఖర్చును, హంగులు, ఆర్భాటాలకు చేసిన వ్యయాన్ని గుర్తు చేసుకుని ముక్కునవేలేసుకుంటున్నారు.
ఇదీ బాబు దుబారా..
చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుబారాను చూస్తే కళ్లుబైర్లుకమ్ముతాయి. బాబు చేసిన దాబారా ఖర్చులను ఇప్పుడు తలుచుకుంటే.. ఈ మొత్తాలతో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుందనిపిస్తుంది. బాబు చేసిన దుబారా ఖర్చుల్లో కొన్ని..
1. దేశ, విదేశాలు, రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి ప్రయాణాలకు ఉపయోగించిన ప్రత్యేక విమానాల ఖర్చు రూ. 100 కోట్లు
2. ఏడాదికే వదిలి వచ్చిన హైదరాబాద్ సచివాలయంలోని ఎస్ బ్లాక్‌లోని సీఎం కార్యాలయ హంగులకు రూ. 14.63 కోట్లు
3. హైదరాబాద్‌లో తొలుత సీఎం కార్యాలయం హెచ్ బ్లాకు హంగులకు రూ. 6.29 కోట్లు
4. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ హంగులకు రూ. 9.47 కోట్లు
5. సీఎం కార్యాలయ ఫర్నీచర్ కోసం రూ. 10 కోట్లు
6. మదీనాగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి రూ. 4.37 కోట్లు
7. ఇరిగేషన్ గెస్ట్ హౌస్, సీఎం విజయవాడ క్యాంపు ఆఫీసు రూ. 42 కోట్లు
8. చంద్రబాబుకు కోసం ప్రత్యేక బస్సు రూ. 5.50 కోట్లు
9. రాజధాని నిర్మాణానికి ప్రధాన శంకుస్థాపనకు రూ. 250 కోట్లు
10. రాజధానికి మరో మూడు శంకుస్థాపనలకు రూ.100 కోట్లు
11. రాజధాని నిర్మాణంలో కన్సల్టెంట్లుకు రూ. 300 కోట్లు
12. తాత్కాలిక సచివాలయం, ఇతర మరమ్మత్తులు రూ. 1100 కోట్లు
13. రాజధాని మాస్టర్‌ప్లాన్ కోసం రూ. 115 కోట్లు
14. జన్మభూమి కార్యక్రమాలకు రూ. 150 కోట్లు
15. గోదావరి, కృష్ణా పుష్కరాల ప్రచారానికి రూ. 160 కోట్లు
16. నవ నిర్మాణ దీక్షల కోస రూ. 80 కోట్లు
17. మంత్రులు, అధికారులతో కలసి సీఎం విదేశీ పర్యటన ఖర్చు రూ. 120 కోట్లు
18. పోలవరం బస్సు యాత్ర ఖర్చు రూ. 400 కోట్లు
19. పోలవరం ఈవెంట్ల కోసం అయిన ఖర్చు రూ. 152 కోట్లు
20. వ్యాపీ సిటీస్ సదస్సుల కోసం రూ. 100 కోట్లు
21. అమరావతి సందర్శన బస్సు యాత్రలకు రూ. 39.88 కోట్లు
22. అమరావతిలో సింగపూర్ సెట్టింగులకు రూ. 44.50 కోట్లు
23. ఎన్నికల ముందు బాబు ప్రచారానికి రూ. 582 కోట్లు
24. భాగస్వామ్య సదస్సులకు రూ. 150 కోట్లు
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కోటి, రెండు కోట్ల రూపాయలో జరిగిన దుబారాకు లెక్కేలేదు. మొత్తం ఐదేళ్లలో చంద్రబాబు చేసిన దుబారా విలువ 5 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. దుబారాకే బ్రాండ్ అంబాసిడర్‌గా పేరొందిన చంద్రబాబు.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తూ.. జగన్ సర్కార్ పత్రికలకు ప్రకటనలు ఇవ్వడాన్ని దుబారా ఖర్చు అంటుండడం ఆశ్చర్యంగా ఉంది.
Also Read : ప్రతిపక్ష పాత్రకు టీడీపీ ఎంత న్యాయం చేసింది?