“జగన్ సర్కార్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోంది. ఏపీలో రాజిరెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. ఏకగ్రీవాల పేరుతో పల్లెల్లో అశాంతిని రగిలించే ప్రయత్నం జరుగుతోంది ” ఇదీ గత కొంతకాలంగా అధినేత చంద్రబాబుతో సహా ఏపీ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఆరోపణలు. జగన్ సర్కార్ రాజ్యాంగ విరుద్దంగా ఎక్కడ ఎలా పనిచేస్తోందో వాళ్లు చెప్పలేదు. అధికారంలో ఉన్న పార్టీని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే ఎజెండా తప్ప.
కానీ 40 వసంతాల రాజకీయ అనుభవం ఉందని తన భుజాలు తానే తడుముకు చంద్రబాబు మాత్రం ఏదో ఫ్రస్టేషన్లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడాడని అనిపిస్తోంది. అందుకు నిదర్శనమే..రాజ్యాంగం, నిబంధనల గురించి మాట్లాడిన చంద్రబాబు, ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో కనీవినీ ఎరుగుని రీతిలో గ్రామ పంచాయితీ ఎన్నికలకోసం మేని ఫెస్టో విడుదల చేయడం చూస్తుంటే ఇదా రాజ్యాంగ స్ఫూర్తి అని జనం ముక్కున వేలేసుకోకతపప్పడం లేదు.అంతెందుకు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటు చంద్రబాబుపై చర్యలు తీసుకోండి వైసీపీ నేత అంబటి డిమాండ్ చేశారు.
ఇక వివరాల్లోకి వెళితే.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ‘పల్లె ప్రగతి-పంచ సూత్రాలు’ పేరిట మేనిఫెస్టో( కరపత్రమే అనుకుందాం) రిలీజ్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై టీడీపీ అభివృద్ధి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ‘పల్లె ప్రగతి-పంచ సూత్రాలు’ కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు. ‘పల్లెలు మళ్లీ వెలగాలి’ అనే కరపత్రాలను కూడా ప్రతి ఇంటికీ పంచాలని తెలిపారు. గెలిపిస్తే ఊరికి ఏంచేస్తారో వివరిస్తూ ప్రజల్ని మెప్పించాలి అని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడ ఘర్షణలు తలెత్తినా పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నెంబర్ ను, ఫొటోలు, వీడియో సాక్ష్యాలను పంపడానికి మరో నెంబరు తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు.
ఇదీ చంద్రబాబు రాజకీయ అనుభవం. అసలు పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇంతఅనుభవం ఉన్న చంద్రబాబుకు ఆ విషయం తెలియదా. లేకా పంచాయతీలు పార్టీల వారిగా విడదీసి గొడవలు రేపడం, పరోక్షంగా శాంతి భద్రతల సమస్య అంటూ మరో రూపంలో ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేందుకు చంద్రబాబు వేసిన కొత్త స్కెచ్చే ‘పల్లె ప్రగతి-పంచ సూత్రాలు’ కరపత్రాల ఉద్దేశ్యమా.ఎందుకంటే చంద్రబాబు పార్టీ పరంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అంటే అల్లర్లు అవుతాయని బాబు ముందే ఎలా ఊహించారు.ఏదైనా ఊర్లో అల్లర్లు జరిగితే ప్రభుత్వం అందుకోసం ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్లు ఏలాగైనా ఏర్పాటు చేస్తుంది.ఇక బాబు సెంటర్లు ఎందుకు.
మొత్తానికి ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు జోక్యం చేసుకోవడమే అప్రజాస్వామికం ..రాజ్యాంగ విరుద్దం. అలాంటిది ఏపీ సర్కార్ రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తుందంటూ ఇంతకాలం గగ్గోలు పెట్టిన చంద్రబాబు, కరపత్రాల పేరుతో మ్యానిఫెస్టో విడుదల చేసి,పార్టీశ్రేణులను పురిగొల్పుతున్నారంటే ..తప్పకుండా ఏదో అజెండా ఉండే ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తాయి. ఎందుకంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని 2018లోనే హైకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆఖరిసారి ఎన్నికలు జరిగాయి. రెండున్నరేళ్లుగా ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ విధి అంటూ కోర్టుకెక్కి మరీ పంచాయతీ పెట్టిన నిమ్మగడ్డ, ఇప్పుడు కరోనా టైంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నిమ్మగడ్డ మీద ఈగవాలితే తమపై ఎనుగు తొక్కినంత ఇదిగా తెలుగు తమ్ముళ్లు బాధపడి పోతున్నారు.
సుప్రీం తీర్పును గౌరవించి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుంటే.. చంద్రబాబు మాత్రం రాజ్యాంగ విరుద్దంగా మేని ఫెస్టో (పేరుకు కరపత్రం) విడుదల చేసి.. వీడియా కాన్ఫరెన్సులు ద్వారా కార్యకర్తలకు దిశా నిర్ధేశ్యం చేస్తున్నారు. సలహాలు అందించేందుకు పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు అందుబాటులో ఉంటారని, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే తగినరీతిలో బుద్ధి చెప్పాలని పిలుపు నిస్తున్నారు. తన హయాంలో దాదాపు రెండేళ్లు కోర్టు తీర్పును పట్టించుకోకుండా పంచాయితీ ఎన్నికలు నిర్వహించని చంద్రబాబు, అప్పుడు మౌనం వహించిన ఎస్ ఈసీ ఇప్పుడు రాజ్యాంగం,విధి అంటూ గొంతుచించుకున్నారు. తీరా ఎన్నికలు ప్రక్రియ స్టార్ట్ అయ్యాక చంద్రం సార్ రూటుమార్చారు.అంటే ఏదో రకంగా సర్కార్ ను అబాసు పాలు చేసేందుకు ముందస్తు ప్లాన్ ఏదో ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. పచ్చని పల్లెల్లో అల్లర్ల చిచ్చేదో రేగే ప్రమాదం లేకపోలేదు.