Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న తిట్ల రాజకీయం ఢిల్లీకి చేరబోతోంది. తన పార్టీ కార్యాలయంపై వైసీపీ దాడి చేసిందంటూ చెబుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. శనివారం అమిత్‌షాను కలిసేందుకు సమయం అడిగారని టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అపాయింట్‌మెంట్ ఖారారైతే బాబు ఢిల్లీకి వెళ్లడం అమిత్‌షాను కలవడం జరుగుతుంది. అంతకు ముందు.. చంద్రబాబు 36 గంటల ఆమరణనిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. రేపు ఉదయం బాబు దీక్ష మొదలుపెట్టునున్నారు.
దాడికి కారణం చెప్పాలి కదా..?
టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి చేసిందని చంద్రబాబు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తారు సరే. ఫిర్యాదు చేసే ముందు.. అసలు దాడి జరగడానికి కారణం చంద్రబాబు చెప్పాల్సి ఉంటుంది. కారణం చెప్పకుండా.. దాడి చేశారని ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు అందుకున్న హోం మంత్రి అమిత్ షాకు అర్థం కావాలంటే.. అసలు దాడి ఎందుకు జరిగిందో తెలియాలి. బాబు చెప్పకపోయినా.. అమిత్ షా అయినా దాడి ఎందుకు జరిగిందని ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు ఏమని చెబుతారు..? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మా పార్టీ నేతలు ఇటీవల తిడుతున్నారు. నా కుమారుడు లోకేష్, నా పార్టీ నేత, మాజీ మంత్రిగా పని చేసిన చింతకాయల అయ్యన్న పాత్రుడు బూతులు తిట్టారు. వీరే కాకుండా మా పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టాడని చెబుతారా..? ఈ విషయం చెప్పినా.. ఏమని తిట్టారని కూడా అమిత్ షా అడిగితే.. చంద్రబాబు ఏం చెబుతారు..?
Also Read : TDP Chandrababu – తన బాధ ప్రపంచం బాధ.. చంద్రబాబు నయా ట్రెండ్
మహారాష్ట్ర సీన్ గుర్తుకు వస్తే..
చంద్రబాబు ఫిర్యాదు చేసే సమయంలో.. అమిత్ షాకు మహారాష్ట్ర సీన్ గుర్తుకు వస్తే అంత కష్టపడి ఢిల్లీకి వెళ్లడం వృథా అవుతుందనడంలో సందేహం లేదు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అంటనే ఆయనపై కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు. ఇటీవలే ఈ ఘటన జరిగింది. సదరు కేంద్ర మంత్రి కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. నారాయణ్ రాణే బూతులు ఏమీ మాట్లాడలేదు. కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. చెప్పదెబ్బ కొట్టాలని మాత్రమే అన్నారు. దానికే కేసు, అరెస్ట్ జరిగింది. అలాంటిది సీఎంను పట్టుకుని బూతులు తిడితే.. కేసులు పెట్టకుండా, అరెస్ట్ చేయకుండా ఊరుకున్నారా..? అనే సందేహం అమిత్ షాకు రాకుండా ఉండదు. అదే జరిగితే.. చంద్రబాబు తాను చేయబోతున్న ఫిర్యాదు బూమరాంగ్ అవడం ఖాయమే.
అమిత్‌షాకు కూడా స్వానుభమే కదా..
రాజాకీయాలను రాజకీయాలుగా చూడకుండా.. నేతలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని బూతులు తిట్టడం, రాళ్లు వేయడం, అడ్డుకోవడం వంటి పనులు టీడీపీ చేస్తుందని అమిత్‌షాకు తెలియంది కాదు. ఆయన పార్టీకి, ఆయనకు ఈ విషయంలో మంచి అనుభవమే ఉంది. బీజేపీతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చి.. ఎన్నికలకు ఏడాది ఉందనగా.. పొత్తు తెంచుకున్న టీడీపీ 2018 నుంచి 2019 ఎన్నికల వరకు దాదాపు ఏడాది పాటు ప్రధాని మోదీని, తనను ఏ విధంగా దూషించింది.. అమిత్ షాకు గుర్తుండే ఉంటుంది. ‘నాకు కుటుంబం ఉంది.. భార్య ఉంది.. కుమారుడు, కోడలు, మనవడు ఉన్నాడు.. మోదీకి ఎవరున్నారు.. అసలు మోదీ ఎవరు..?’ అని ధర్మాపోరాట దీక్షలో చంద్రబాబు అన్న మాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : TDP Undemocratic Behavior – ముఖ్యమంత్రి మీద టీడీపీ కుటిల రాజకీయం ఎందుకు..?
అదే ధర్మపోరాట దీక్షలో.. మేము పిలుపు ఇస్తే.. మోదీని తరిమి తరిమి కొడారు.. ఇది గుజరాత్ కాదు.. బంకర్లలో దాక్కునా బయటకు తెచ్చి కొడతారని ఎమ్మెల్యే బాలయ్య మోదీకి తెలియాలని హిందీలో చేసిన వాఖ్యల తాలుకూ వీడియో కూడా సామాజిక వేదికల్లో కనిపిస్తోంది. ఇక తిరుపతికి దైవ దర్శనం కోసం వచ్చిన అమిత్‌షా కాన్వాయ్‌ను 2018 ఏప్రిల్‌లో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కాన్వాయ్‌పై రాళ్లు కూడా రువ్వాయి. గత తాలుకూ అనుభవాల నేపథ్యంలో బాబు ఫిర్యాదుపై.. అమిత్ షా ముందుగానే ఓ అంచనాకు వచ్చే అవకాశం లేకపోలేదు.