iDreamPost
android-app
ios-app

వంశి రాజీనామా పై చంద్రబాబు లేఖ

వంశి రాజీనామా పై చంద్రబాబు లేఖ

 గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామా లేఖపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వంశీ ప్రస్తావించిన‌ అంశాలను ఉదహరిస్తూ చంద్రబాబు తిరిగి లేఖ రాశారు. వైసీపీ నాయకులు మరియు కొంతమంది ప్రభుత్వ అధికారుల వల్ల రాజీనామా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజల ప్రయోజనాల కోసం తిరిగి పోరాడాలని సూచించారు. మీపై పెట్టిన కేసు దురుద్దేశంతో కూడినదని చెప్పారు. అర్హత గల పేద ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించడం తప్పేమీకాదన్నారు. రాజకీయాలకు రాజీనామా చేయడం లేదా నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ఈ పోరాటంలో ‘నా వ్యక్తిగతంగా.. పార్టీ తరపున మేము మీకు అండగా నిలబడతా’మని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులను ప్రస్తుత ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వేధిస్తోందన్నారు. ఈ వేధింపులను ఐక్యంగా ఎదుర్కొంటామని చంద్రబాబు పేర్కొన్నారు.