iDreamPost
android-app
ios-app

మొదటిసారి చైతు సరసన ముగ్గురు

  • Published Dec 13, 2020 | 7:31 AM Updated Updated Dec 13, 2020 | 7:31 AM
మొదటిసారి చైతు సరసన ముగ్గురు

కింగ్ అక్కినేని నాగార్జున ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలు చాలా చేశారు కానీ నాగ చైతన్య మాత్రం ఎక్కువ సింగల్ బ్యూటీలున్న చిత్రాలే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. ప్రేమమ్ ఒక్కటే దీనికి మినహాయింపు. మిగిలినవన్నీ ఒక్క జోడితోనే సర్దుకున్నవి. కాగా చైతు కెరీర్ లో మొదటిసారి ముగ్గురు భామలతో రొమాన్స్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న థాంక్ యులో ట్రిపుల్ బొనాంజా ఉండొచ్చని లేటెస్ట్ అప్ డేట్. వాళ్ళు ఎవరు అనే క్లారిటీ ఇంకా లేదు కానీ ప్రస్తుతం డైరెక్టర్ ఆ క్యాస్టింగ్ పనిలోనే ఉన్నారు. త్వరలో వివరాలు తెలియొచ్చు.

ఇందులో చైతు రైతుగా, ప్రవాసాంధ్రుడిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే డబుల్ రోలా లేక ఒకే పాత్రలో అన్ని వేరియేషన్స్ ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ తో రూపొందుతున్న ఈ మూవీ మీద విక్రమ్ కుమార్ ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హలో, గ్యాంగ్ లీడర్ రెండూ ఫ్లాప్ కావడంతో మళ్ళీ తన స్టైల్ అఫ్ మేజిక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందులోనూ చైతుని ఆల్రెడీ మనంలో డీల్ చేసిన విక్రమ్ కుమార్ కు అతనితో మంచి కెమిస్ట్రీ ఉంది. షూటింగ్ కూడా వీలైనంత వేగంగా పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోంది.

నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తయినప్పటికీ రిలీజ్ విషయంలో నిర్మాతలు పెదవి విప్పడం లేదు. సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉండే అవకాశం స్పష్టం కావడంతో అయితే ఫిబ్రవరి లేదా ఏకంగా ఏప్రిల్ కు వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్, సాయి పల్లవి హీరోయిన్, మెలోడియోస్ ఆల్బమ్ తదితరాలు యూత్ ని ఆకట్టుకుంటున్నాయి. ఒకవేళ వేసవే టార్గెట్ చేసుకుంటే అభిమానులు ఎదురుచూపులు ఇంకొంత కాలం కొనసాగాల్సిందే. వీటి తర్వాత నాన్నతో కలిసి చేయాల్సిన బంగార్రాజు ప్రకటన కూడా ప్లానింగ్ లో ఉన్నట్టు వినికిడి