iDreamPost
android-app
ios-app

తాతయ్య పేరుతో మనవడి సినిమా

  • Published Apr 30, 2020 | 7:01 AM Updated Updated Apr 30, 2020 | 7:01 AM
  • Published Apr 30, 2020 | 7:01 AMUpdated Apr 30, 2020 | 7:01 AM
తాతయ్య పేరుతో మనవడి సినిమా

అక్కినేని మూడో తరం వారసుడిగా ఎదుగుతున్న నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ విడుదల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. కొంత బాలన్స్ వర్క్ తప్ప షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీని లాక్ డౌన్ అయ్యాక తక్కువ గ్యాప్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా చైతు పరశురామ్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా మహేష్ బాబు ప్రాజెక్ట్ వల్ల క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం కొద్దివారాల క్రితం జోరుగానే సాగింది.

అయితే వాటికి స్వయంగా పరశురామే స్వయంగా చెక్ పెట్టారు. చైతుతో మూవీ ఖచ్చితంగా ఉంటుందని నాగేశ్వర్ రావు అనే టైటిల్ తో స్క్రిప్ట్ కూడా సిద్ధమయ్యే దిశగా ఉన్నట్టు సంకేతం ఇచ్చారు. అయితే మహేష్ తో చేస్తున్న చిత్రం పూర్తయ్యాకే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

నాగేశ్వర్ రావు అంటే టైటిల్ ఎమోషనల్ గా అభిమానులకు బాగా కనెక్ట్ ఆవుతుంది. తాతయ్య పేరుతో మనవడు సినిమా చేయడం అరుదుగా జరుగుతుంది. చైతు తాతయ్య తో నటించే అదృష్టాన్ని మనం రూపంలో దక్కించుకున్నాడు. అది మోస్ట్ మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది.

ఏఎన్ఆర్ గారిని అమితంగా ప్రేమించే చైతు అదే పేరుతో సినిమా అంటే కథ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో వేరే చెప్పాలా. మనంలో నాగ చైతన్య పాత్ర పేరు నాగేశ్వర్ రావే కావడం గమనించాల్సిన అంశం. ఇది యాదృచ్చికంగా జరిగిందే అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ పట్ల బాగా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ సబ్జెక్టు ఏ జోనర్ లో ఉండొచ్చన్న విషయం మాత్రం పరశురామ్ లీక్ చేయలేదు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం డ్రీం ప్రాజెక్ట్ గా భావిస్తున్న మహేష్ 27 మీదే ఉందన్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చైతుతో సినిమా వచ్చే ఏడాది మొదలుపెడతారు

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş