భారత ప్రభుత్వంలో అనేక శాఖలు ఉంటాయి. అయితే వాటిల్లో ప్రధానమైనది రక్షణ శాఖ. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, ఇతర దేశాల యుద్ధాల నుంచి దేశాన్ని కాపాడేది ఈ రక్షణ శాఖానే. అందుకే ఈ వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అలానే ఎన్నో సంస్కరణలు కూడా చేపట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల అగ్నిపథ్ అనే పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఎంతో మంది యువతను ఆర్మీలో చేరుతున్నారు. తాజాగా ఆర్మీలో చేరాలనుకునే మహిళల విషయంలో కూడా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ సైన్యంలో చేరే మహిళలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త తెలిపింది. ఆర్మీలో మహిళల సంఖ్యను పెంచే యోచనలో కేంద్రం ఉందని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వెల్లడించారు. పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జులై 2022 నుంచి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి మహిళా ఆర్మీ అభ్యర్థుల కోసం 20 ఖాళీలను రిజర్వు చేశామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం షార్ట్ సర్వీస్ కమిషన్ లో మహిళల కోసం 90 ఖాళీలు ఉన్నాయని, ఇందులో 10 అదనపు ఖాళీలు 2023 జూన్ నుంచి అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఆర్మీలోనే కాకుండా రీమోంట్, వెటర్నరీ కార్ప్స్ లోకి మహిళా అధికారులను చేర్చుకోవడానికి 2023 మార్చి నుంచి ఆమోదం లభించిందని మంత్రి అజయ్ భట్ తెలిపారు. అలానే ఆర్మీ ఏవియేషన్ లో ఫైలట్లుగా మహిళలకు ప్రవేశం ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ ఏడాది జులై నాటికి ఆర్మీ మెడికల్ క్యాడర్ లోని మొత్తం మహిళల సంఖ్య ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో 1,212 మంది, ఆర్మీ డెంటల్ కార్ప్స్ లో 168, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ లో 3,841 మంది మహిళలను చేర్చుకున్నారు. అంతేకాక భారత సైన్యంలో మహిళ సంఖ్యను మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మరి.. ఈ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి! కొత్తరూల్ పై సర్కార్ అధ్యయనం..