iDreamPost
android-app
ios-app

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ పార్ట్‌ – 4

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ పార్ట్‌ – 4

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో నాలుగో విడత ప్యాకేజీని ఈ రోజు శనివారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ వెల్లడించారు. ఈ దఫా బొగ్గు, ఖనిజం, రక్షణ ఉత్పత్తులు, విమానయానం, అంతరిక్షం, అణువిద్యుత్‌ శక్తి, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు సంబంధించిన ప్యాకేజీని ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. ఈ రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. కార్పొటైజేషన్‌ అంటే ప్రైవేటీకరణ కాదని, సామర్థ్యం, నైపుణ్యాల పెంపు అని ఆర్థిక మంత్రి కొత్త నిర్వ^è ణాన్ని ఇచ్చారు.

– బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.50 వేల కోట్లు.

– గడువులోగా బొగ్గును సరఫరా చేసిన వారికి ప్రొత్సాహకాలు.

– మార్కెట్‌ ధరలకు అనుగుణంగా బొగ్గు సరఫరా.

– బొగ్గును వాయువుగా మార్చేందుకు కొత్త సాంకేతిక విధానం అభివృద్ధి.

– అల్యూమినియం ఉత్పత్తులకు తగినంత బొగ్గు, బాక్సౌట్‌ కలిపి కేటాయిస్తాం.

– బాక్సౌట్, బొగ్గు.. రెండింటికి కలిపి సంయుక్తంగా వేలం నిర్వహణ.

– మైనింగ్‌ లీజుల విషయంలో విధించే స్టాంఫ్‌ డ్యూటీ హేతుబద్ధీకరణ.

– రక్షణ వ్యవస్థలో అత్యాధునిక సాధనా సంపత్తి దిగుమతికి నిర్ణయం.

– ఆయుధాల తయారీ, తయారీదారుల ఎంపికలో ఆలస్యం నివారణ.

– పీపీపీ విధానంలో మరో 6 విమానాశ్రయాలకు వేలం.

– ఏరోస్పేస్‌ రూట్ల హేతుబద్ధీకరణ.

– విమానాశ్రయ రంగం అభివృద్ధికి రూ.2,300 కోట్లు

– నూతనంగా మరో 13 వేల కోట్ల రూపాయలతో 12 విమానాశ్రయాల నిర్మాణం.

– విద్యుత్‌ ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా డిస్కంలలో సంస్కరణలు.

– వినియోగదారులపై భారం పడకుండా డిస్కంల నష్టాలు తగ్గింపు

– కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిస్కంల ప్రైవేటీకరణ.

– విద్యుత్‌ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా సంస్కరణలు.

– ప్రైవేటు ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసేందుకు వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ ఏర్పాటు.

– ప్రైవేటు ఆస్పత్రులు, విద్యా సంస్థలు ఏర్పాటును ప్రోత్సహించేందుకు 8,100 కోట్ల రూపాయలు కేటాయింపు.

– అంతరిక్ష రంగంలో ఇస్రోతోపాటు ప్రైవేటు సంస్థలకు అవకాశం.

– జియో స్పేషియల్‌ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం.