iDreamPost
android-app
ios-app

రోడ్డు ప్రమాదాల్లో సహాయం చేసేవారికి అవార్డులు ఇవ్వనున్న కేంద్రం

రోడ్డు ప్రమాదాల్లో సహాయం చేసేవారికి అవార్డులు ఇవ్వనున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సహాయం చేసి వారిని ప్రమాదం నుండి కాపాడే ప్రయత్నం చేసేవారికి అవార్డులు ప్రదానం చేసి సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రతీ సంవత్సరం ప్రమాదాల్లో సాయం చేసిన మానవతామూర్తులకు ప్రతి రాష్ట్రం నుంచి 1, 2, 3 అవార్డులతో పాటు ధ్రువీకరణ పత్రం కూడా అందిస్తారు.

రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో ఎక్కువమంది తమకు ఎందుకొచ్చిన రిస్క్ అని బాధితులకు సహాయం చేయడానికి ముందుకురారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం కారణంగా క్షతగాత్రులకు సాయం చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇందుకోసం రహదారి భద్రతా విభాగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వారి పేర్లను అవార్డుల కోసం ప్రతిపాదించాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర రహదారి, రవాణా శాఖ లేఖ రాసింది.

కాగా ఈ అవార్డులకోసం వివిధరాష్ట్రాలకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వానికి నామినేషన్ పంపాలి. ఆ వచ్చిన నామినేషన్లనో ముగ్గురికి ధ్రువీకరణపత్రంతో పాటు రివార్డును కూడా అందించనున్నారు. తొలి బహుమతికి రూ.5 లక్షలు, రెండో బహుమతికి రూ.2 లక్షలు, మూడో బహుమతికి రూ.లక్ష అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయాల్లో క్షతగాత్రులను కాపాడేందుకు మరికొందరు ముందుకు వస్తారని భావిస్తున్నారు.