Idream media
Idream media
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలోని తిరుపతి లోక్‌సభకు, తెలంగాణలోని నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 17న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణలో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17న ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 23న ఎన్నికల సంఘం నోటిపికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండా.. తమిళనాడు, అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరితో పాటు మే 2న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
తిరుపతిలో రెండో స్థానంపై ఆసక్తి..
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల కోళాహళం ఇప్పటికే ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీని అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని గ్రామాల్లో రథయాత్ర చేయాలని పార్టీ నేతలకు టీడీపీ దిశానిర్ధేశం చేసింది. ఇక పనబాక లక్ష్మీ ప్రచారంలోకి దిగడమే తరువాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరును పరిశీలించారు. ఆయన పేరు దాదాపు ఖరారైనట్లే. ప్రకటనే తరువాయి. బీజేపీ–జనసేన పార్టీల తరఫున బీజేపీ ఇక్కడ పోటీ చేస్తున్నట్లు ఇటీవల నిర్ణయించారు. అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అధికార వైసీపీ ఫుల్ జోష్‌పై ఉండగా.. టీడీపీ, బీజేపీ–జనసేన శ్రేణులు ఢిలీ పడిపోయాయి. ఉప ఎన్నికల్లో వైసీపీ గెలవడం లాంఛనమే. రెండో స్థానంలో ఎవరు నిలుస్తారనేదే ఆసక్తికర అంశం.
నాగార్జునసాగర్ లో టిఆర్ఎస్ జెండా ఎగురుతుందా?
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తన ఆధిక్యాన్ని చూపించు కోవాలని ఆరాటపడుతోంది. అయితే ఇక్కడ టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ నడుస్తుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోతిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అండదండలు ఉండడంతో ఈసారి ఆయనకే నాగార్జునసాగర్ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేటీఆర్ అనుచరుడైన ఎన్ఆర్ఐ రవీంద్ర రెడ్డి పోటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక టీడీపీ విషయానికొస్తే తెలంగాణలో ఇప్పటికే కనుమరుగైన టీడీపీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుకుని తెలంగాణలో పార్టీ గౌరవ నిలవాలని చూస్తుంది. న్యాయవాది అరుణ్ కుమార్ ను టిడిపి అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. 1999, 2004, 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టిడిపి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది అదే ఊపుతో ఈ సారి ఎలాగైనా ఎక్కడ విజయం సాధించాలని ప్రయత్నం చేస్తుంది.