iDreamPost
android-app
ios-app

తెలంగాణలో ఎలక్షన్స్.. రంగంలోకి 20 వేల కేంద్ర బలగాలు!

  • Published Oct 20, 2023 | 8:54 PM Updated Updated Oct 20, 2023 | 8:54 PM

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలు ప్రచారాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కి చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలు ప్రచారాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కి చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో ఎలక్షన్స్.. రంగంలోకి 20 వేల కేంద్ర బలగాలు!

తెలంగాణలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఇక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ, బంగారు, వెండి ఆభరణాలు, చీరలు, ఇతర సామాగ్రి పంపకాలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వాటికి చెక్ పెడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్లకు పైగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హూంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగడానికి కేంద్ర హూంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు రెండురోజుల్లో కేంద్ర బలగాలను పంపించే ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వంద కంపెనీల నుంచి 20 వేల కేంద్ర బలగాలు తెలంగాణకు రానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు కేంద్ర హూంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్,నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సిమాబల్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో డిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి బలగాలకు చెందిన 60-80 మంది వరకు సిబ్బంది ఉంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని బందోబస్తు నిర్వహించనున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలన ఏర్పాటు చేసుకొని ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూసుకుంటాయి. ఈ క్రమంలో సైనిక బృందాలు పలు విడతలవారీగా కవాతు జరపనున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎలంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే వీరి లక్ష్యం. అంతేకాదు ఓటర్లను భయాందోళనకు గురిచేసేవారిని కంట్రోల్ చేయడం లాంటివి జరుగుతుంది. అలాగే ఓటర్లకు ఫ్లాగ్ మార్చ్ ల ద్వారా భరోసా కల్పించనున్నాయి.

పోలింగ్ జరిగే ముందు రోజు ఆ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకొని గట్టి బందోబస్తు లో నిగ్నం కానున్నాయి. ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాలు వీరి ఆధీనంలోనే ఉండనున్నాయి. ఈవీఎంలను భద్రపరిచి కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లడం. పోలింగ్ అనంతరం తిరిగి స్ట్రాంగ్ రూమ్ కేంద్రాలకు తరలించడం లాంటి వంటి ప్రక్రియ కేంద్ర బలగాల నియంత్రణలోను ఉండనుంది. అంతేకాదు ఓటర్లను ప్రలోభ పెట్టే డబ్బు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేసే తనిఖీల్లోనూ ఈ బలగాలు సహాయంగా ఉండనున్నాయి.