iDreamPost
android-app
ios-app

అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ తేదీ మార్చిన CEC!.. కారణం తెలిస్తే షాక్!

అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ తేదీ మార్చిన CEC!.. కారణం తెలిస్తే షాక్!

దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే తాజాగా వీటిలోని ఓ రాష్ట్రంలో జరిగే ఎన్నికల పోలింగ్ తేదీని మారుస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కారణం వల్లనే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చుతున్నట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇంతకీ ఏ రాష్ట్రంలో తెలుసా?

దేశంలో ఇప్పుడు పెళ్లిల్ల సీజన్ కొనసాగుతోంది. మంచి ముహూర్తాలు ఉండడంతో చాలా పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలింగ్ జరిగే నవంబర్ నెలలో వేల సంఖ్యలో పెళ్లిల్లు ఉండడం వల్ల ఆ రాష్ట్రంలో పోలింగ్ తేదీలో మార్పు చోటుచేసుకుంది. ఈ క్రమంలో నవంబర్ 3న జరుగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను రెండు రోజులు వాయిదా వేసి నవంబర్ 25 వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నిర్ణయం తీసుకుంది.

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నవంబర్‌ 23 వ తేదీన రాజస్థాన్‌లో వేలకద్ది వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండటం వల్ల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. రాజకీయ నాయకులు, సామాజిక సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లిల్ల కారణంగా పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. పోలింగ్ శాతంపై ప్రభావం పడకుండా ఉండేందుకు రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ ను నవంబర్ 25కు మార్చింది. ఇక ఫలితాలను మిగిలిన 4 రాష్ట్రాలతోపాటు డిసెంబర్‌ 3 వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిపింది.