ఈ మాట ఎవరు అని ఉంటారు?తెలుగు రాజకీయాల్లో ఈ మాట ఒకే ఒకరి సొంతం ఆయనే చంద్రబాబు… అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి “అందరి జాతకాలు నా దగ్గరున్నాయ్” అంటూ వేలు చూపుతూ ఊగిపోయిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా టీడీపీ నేతలకే ఈ మాట చెప్తున్నారు…
విషయంలోకి వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో కుప్పం చరిత్రలో తక్కువ మెజారిటీతో చంద్రబాబు గెలిచాడు. మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు కన్నా వైసీపీ అభ్యర్ధీ చంద్రమౌళి ముందంజలో నిలిచాడు. కడకు ముప్పై వేల మెజారిటీతో చంద్రబాబు గెలిచాడు. 30 వేల మెజారిటీ అంటే మంచి మెజారిటీని కానీ చంద్రబాబు 2014 లో నలభై ఏడువేలు,2009లో నలభై ఆరు వేలు, 2004లో అరవై వేలు, 1999లో అరవై ఐదు వేలు,1994లో యాభై ఏడు వేలు, 1989లో ఏడు వేల మెజారిటీతో గెలిచాడు.
ఈ మెజార్టీలు చూస్తే కుప్పం కోటకు బీటలు వాడుతున్నట్లు అర్ధమవుతుంది.ఈ అసహనంతోనే నిన్న జరిగిన కుప్పం తెలుగుదేశం సమీక్షా సమావేశంలో “మీ అందరి జాతకాలు నా దగ్గరున్నాయ్” అంటూ కుప్పం నాయకులను బెదిరించే ధోరణిలో మాట్లాడాడు. స్థానిక నాయకులు కూడా కొందరు టీడీపీ నేతలు అధికారపక్షంతో కుమ్మక్కుఅవుతున్నారని చంద్రబాబు సమక్షంలో ఆరోపణలు చేశారు.
ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుక్కన మాజీ వైసీపీ నేత, జడ్పీ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఈ సమీక్షా సమావేశానికి మొహం చాటేశాడు.
గత నాలుగు ఎన్నికల్లో నామినేషన్ కు కానీ ప్రచారానికి కానీ స్వయంగా కుప్పం వెళ్లని చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల ఫలితాలు, క్యాడర్ బలహీనపడటం ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు 14 ఎమ్మెల్యే స్థానాలునం చిత్తూర్ జిల్లా మొత్తంలో ఒకే ఒక సీటు టీడీపీ గెలవటం కూడా ఆయనకు జిల్లా మీద పట్టు తప్పిందన్న విషయం బోధపడినట్లుంది… అందుకే సమీక్షా సమావేశంలో అసహనంగా మాట్లాడుతున్నారు. అధికారులను బెదిరించినట్లు సొంత పార్టీ క్యాడర్ ను బెదిరిస్తే జరిగే లాభం కన్నా నష్టం ఎక్కువ…
అధికారం కోల్పోయిన తరువాత నేతల బెదిరింపులకు గడగడా లాడటం కాదు కదా ఒక్క గడ కూడా ఉండదు.చంద్రబాబుకు కుప్పం క్యాడరేతో బంధం తెగటం మొదలై చాలా కాలమయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను పట్టించుకున్నదే లేదు.
మొన్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి అనారోగ్యంతో హైదరాబాదు ఆసుపత్రిలో చేరి అనేక వారాలపాటు అక్కడే ఉన్నారు.అభ్యర్ధీ ప్రచారంలో లేకపోయినా వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొని చంద్రబాబును కనిష్ట మెజారిటీకి పరిమితం చేశారు. అభ్యర్థి ప్రచారంలో పాల్గొని ఉంటె చంద్రబాబు మెజారిటీ మరో ఐదు లేక ఏడూ వేలు తగ్గివుండేది.ఈ ఆలోచన కూడా చంద్రబాబు అసహనానికి కారణం కావచ్చు.
ఏమైనా చంద్రబాబుకు ఇది కష్టకాలం,ఆయన కూడా తన పద్దతి మార్చుకుని కార్యకర్తలతో సహనంగా వ్యవహరిస్తే మంచింది.