చంద్రబాబు మాజీ పీఏ ఆస్తి 150 కోట్లా !!?

తాను నిప్పులాంటి వాడినని, ఏనాడు అవినీతి జోలికి పోలేదని,చేతికి వాచ్, ఉంగరం కూడా లేనివాడినని పదేపదే చెప్పే చంద్రబాబు నాయుడి మాజీ పీఏ ఆస్తి రూ.150 కోట్లు ఉండొచ్చని అంచనా. గురువారం హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడి మాజీ పీఏ శ్రీనివాస్ ఆస్తుల మీద ఆదాయపు పన్నుశాఖ దాడులు చేయగా ఈ భారీ ఆస్తులు, ఇళ్లు, భూములు, షాపింగ్ కాంప్లెక్స్ లు, కంపెనీలు వెలుగు చూశాయి.

ఒంగోలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గత పాతికేళ్లుగా చంద్రబాబు వద్ద పీఏగా పనిచేస్తున్నారు.శ్రీనివాస్ సెక్రటేరియట్ లో ఉద్యోగి. గత ఏడాది వరకు ఆయన చంద్రబాబు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. 2019లో చంద్రబాబు ఓడిపోయాక శ్రీనివాస్ మళ్ళీ జిఎడి విభాగంలో విధుల్లో చేరారు.

విజయవాడ, హైదరాబాద్ లో శ్రీనివాస్ కు పలు ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. మరోవైపు రకరకాల పేర్లతో ఆయన పలు కంపెనీలు కూడా స్థాపించినట్టు తెలుస్తోంది. ఆ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని అధికారులు గుర్తించారు.ఉదయం నుంచి జరుగుతున్న ఈ తనిఖీల్లో దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

శుక్రవారం ఆయనకు నోటీసులు ఇస్తారని తెలిసింది. ఆ తరువాత మరిన్ని వివరాలు వెలుగు చూడొచ్చని అంటున్నారు. శ్రీనివాస్ ఆస్తుల మీద జరిగిన ఐటి రైడ్స్ రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యాయి. ఒక సాధారణ పీఏ వందలకోట్లు దోచుకున్నాడు అంటే అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మింగారన్నదాని మీద ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments