iDreamPost
android-app
ios-app

మొగుడ్ని కొట్టి మొగసాలాకెక్కినట్లు – ఆపత్కాలంలో చంద్రబాబు చీప్ పాలిటిక్స్

మొగుడ్ని కొట్టి మొగసాలాకెక్కినట్లు – ఆపత్కాలంలో చంద్రబాబు చీప్ పాలిటిక్స్

వాళ్ళు వందమంది…మేము ఐదుగురం …మాలోమేము తన్నుకుంటాం ..కొట్టుకుంటాం…కానీ మా మీదకు ఎవరైనా మేము నూట ఐదుగురం అన్నాడు ధర్మరాజు ..అంటే లోకల్ పాలిటిక్స్ ఎలాగైనా ఉండొచ్చు కానీ ఉమ్మడిగా అందరికి ముప్పు వస్తే అంతా కలసి పోరాడతాం అన్న సంకేతం ఇచ్చాడన్నమాట.. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుకు ఆరోజు ఈరోజు అని లేదు…సర్వకాల సర్వావస్థల్లోనూ రాజకీయమే కావాలి..ప్రపంచం మొత్తం కరోనా కాటుకు విలవిల్లాడుతోంది. ఇలాంటి తరుణంలో తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన ప్రజలకు రాష్ట్రానికి ఏదోటి చేయాల్సింది పోయి అవతలి ఒడ్డుకు అంటే హైదరాబాద్ వెళ్ళిపోయి తీరిగ్గా కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నాడు.

ప్రజలకు వైఎస్సార్ ప్రభుత్వం ఏమి చేయడం లేదని, తాను ముఖ్యమంత్రి గా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేదన్నట్లు మాట్లాడుతున్నారు.

ఆయన హయాంలో డబ్బులు దుబారా చేసే ఈవెంట్లు తప్ప రాష్ట్ర ఆస్తులు పెంచడానికి గాని , వ్యవస్థలు మెరుగు పడడానికి గానీ ఏమీ చేయలేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉండేది. ఆ అభిప్రాయమే ఎన్నికల్లో ప్రతిబింబించింది ..చివరికి ఘోర పరాభవం ఎదురైంది.

కరోనా వల్ల ప్రభుత్వాలపై ఊహించని రీతిలో అదనపు భారం పడింది. అయితే ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నట్లు విపక్షం ఆరోపణలు చేస్తోంది. అయితే చంద్రబాబు హయాంలో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పులతో ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదన్నది ప్రజల అభిప్రాయం. దానికితోడు ఆయన దిగిపోయేనాటికి బ్యాలెన్స్ వదిలేసిన రూ.40,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులకుతోడు ప్రస్తుత సర్కారు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ.2 వేల కోట్లు. పేదల ఇళ్ల స్థలాలు, భూసమీకరణకు రూ.1,600 కోట్లు, ఆరోగ్యశ్రీ, పింఛన్లకు రూ.1,500 కోట్లు చెల్లించింది. దీంతో ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడింది.

దానికితోడు ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ ‘ మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు ఎక్కువ లేకపోవడం ఒక సమస్యగా మారింది’ అనడం ఆయన దిగజరుడుతానానికి మరో నిదర్శనం. పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి గా ఉన్నవ్యక్తి మరి ఆస్పత్రులు కట్టించకుండా ఏమి చేస్తున్నట్టు. అది ఆయన వైఫల్యం కాదా ..అవన్నీ మరచి ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ విమర్శలు చేయడం ఆయన స్థాయికి సరికాదని అధికారపక్షం అంటోంది.ఇక యువనేత లోకేష్ కూడా ట్విట్టర్లో అసంబద్ధమైన కామెంట్లతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

ఈ సమస్యలన్నీ ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదని, గత ప్రభుత్వ వైఫల్యాలు,బాధ్యతలేనితనమే ఇప్పటి సమస్యలకు మూలకారణాలని ఆయన తెలుసుకుంటే మంచిది…

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş