Idream media
Idream media
చంద్రబాబు ఈ మధ్య తరచుగా సజ్జల రామకృష్ణారెడ్డిని సాక్షి ఆఫీస్‌లో పనిచేసే గుమాస్తాగా అంటూ వున్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి గుమాస్తాకి, జర్నలిస్ట్‌కి తేడా తెలీకపోతే అజ్ఞానమా? అహంకారమా?
బాబు గురించి అందరికీ తెలుసు. సజ్జల గురించే బాబుకి తెలిసినట్టు లేదు. ఆయనకి 35 ఏళ్ల జర్నలిస్ట్ అనుభవం. ఉదయం పత్రికలో ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ఎంత బాధ్యతగా వుంటారో ఆయన సహచరుల్ని ఎవర్ని అడిగినా చెబుతారు. వృత్తిలో నిబద్ధతగా టీంతో స్నేహంగా ఉండడం లక్షణం. సాహిత్యమంటే ప్రేమ. రాజకీయాలంటే ఆసక్తి. చంద్రబాబు అన్నట్టు సాక్షిలో గుమాస్తా కాదు. ఎడిటోరియల్ డైరెక్టర్. పత్రికల్లో అనుకూలంగా వార్తలు రాయించుకోవడం తప్ప పత్రికలు ఎలా పని చేస్తాయో బహుశా చంద్రబాబుకి తెలియక పోవచ్చు.
మండలి స్థాయి విలేకరి నుంచి , హెడ్డాఫీస్‌లో చీఫ్ రిపోర్టర్ వరకూ సబ్ ఎడిటర్ నుంచి ఎడిటర్ వరకూ కొన్ని వేల మంది ఉంటారు. ఇంత మందికి సజ్జల బాస్. బాసిజం అనే పదం ఆయనకి నచ్చదు కాబట్టి మార్గదర్శకుడు అంటే కరెక్ట్. సాక్షిలో ఎంత కష్టపడ్డారో ఆయనతో పనిచేసిన వారందరికీ తెలుసు. అత్యున్నతమైన పదవిలో ఉంటూ కూడా పేపర్ ప్రింట్ అయ్యే వరకూ అందర్నీ ఉత్సాహపరుస్తూ పని చేయించడం ఆయన ప్రత్యేకత. చంద్రబాబుకి సాహిత్యం చదివే అలవాటు లేదు. అందుకే అడ్డగోలుగా మాట్లాడ్తాడు. సజ్జల మంచి చదువరి. ఆయన ఇల్లు సరస్వతీ నిలయం. కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి. సాహిత్య ప్రియుడు కాబట్టే మాట సంస్కార వంతంగా ఉంటుంది. చంద్రబాబుని కూడా మాట తూలడు. ఆయనకి స్థాయి లేదనడంతో చంద్రబాబు స్థాయి ఏంటో తెలుస్తోంది.
చంద్రబాబు అవకాశవాది. ఆషాఢభూతిలా గురువు నుంచి పదవులు కొట్టేయడం తప్ప జ్ఞానం నేర్చుకోడు. ఆయన రాజకీయ గురువు, 1978లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన మాజీ ఎంపీ రాజగోపాలనాయుడు. జర్నలిస్ట్ , రచయిత. ఎన్నో పుస్తకాలు రాసాడు. మరి ఆయన కూడా గుమాస్తానేనా?
అసలు జర్నలిస్ట్‌లు లేకుంటే తెలుగుదేశం పార్టీ ఉండేదా? కాంగ్రెస్‌కి ఎదురు లేదనుకున్న కాలంలో NTR పార్టీ పెట్టాడు. ఆయన గడ్డం గీసుకున్నా, స్నానం చేసినా కూడా ఈనాడులో వచ్చేది. ఈనాడు అనే పేపర్ , NTR చైతన్యరథం వెంబడి చలికి, గాలికి ఎండావానలకి తిరిగిన జర్నలిస్ట్‌లు లేకపోతే TDP అధికారంలోకి వచ్చేదా?
1984లో నాదెండ్ల తిరుగుబాటును ఎదుర్కొని NTR మళ్లీ రావడానికి ఈనాడే కారణం. రెండో సారి అల్లుడిగా చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే NTR రాకపోవడానికి కూడా రెండు పత్రికలే కారణమని అందరికీ తెలుసు. గతాన్ని అంత సులభంగా మరిచిపోయి జర్నలిస్ట్‌లని గుమాస్తాలనడం బాబుకే సాధ్యం.
కాలువ శ్రీనివాసులుకి 1999 ఎన్నికల్లో అనంతపురం ఎంపీ ఎంపీ టికెట్ ఇచ్చినపుడు ఆయన ఈనాడు విలేకరి కాదా? ఆయనకి టికెట్ జర్నలిస్ట్‌గా ఇచ్చారా? గుమాస్తాగా ఇచ్చారో బాబుకే తెలియాలి. మంత్రిగా ఉన్నప్పుడు కాలువ శ్రీనివాసులు వైసీపీని ఎన్నోసార్లు విమర్శించారు. మరి ఆయన్ని ఈనాడులో పనిచేసిన గుమాస్తా అని ఎవరైనా అన్నారా?
సజ్జల బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు రాజకీయాలు కాకుండా బాబు మాదిరి కుళాయి రాజకీయాలు మాట్లాడలేడు కదా! పదవి పోయింది సరే, బాబుకి మతికూడా పోయిందా?