iDreamPost
android-app
ios-app

కొత్త సమస్యలు కొని తెచ్చుకున్న ర‌ఘురామ‌కృష్ణంరాజు

కొత్త సమస్యలు కొని తెచ్చుకున్న ర‌ఘురామ‌కృష్ణంరాజు

న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణంరాజు ఆర్థికంగాను, వ్య‌క్తిగ‌తంగాను చిక్కుల‌ను ఎదుర్కొంటున్నారు. ఆయ‌న దురుసు వైఖ‌రి కార‌ణంగా ఇబ్బందుల‌ను కొని తెచ్చుకుంటున్నారు. గ‌త నెల‌లో ఆయ‌న‌కు చెందిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ రూ.1327 కోట్ల అప్పులకు గాను తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 872 కోట్లే ఉండ‌డంతో దివాళా అయిన కంపెనీ పరిష్కార ప్రక్రియ చేయాలని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ విన‌తిపై స్పందించింది. కాగా.. ఇప్పుడు కొత్త కేసుల్లో ర‌ఘురామ‌రాజు ఇరుక్కున్నారు. చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. 

సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ను కులం పేరుతో పాటు, అసభ్యపదజాలంతో దూషించాడని గొంది రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. చింతలపూడి ఏపీ సునీల్‌ కుమార్‌ సొంతగ్రామం. రాజు ఫిర్యాదుతో రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చింతలపూడి పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి రఘురామకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో రఘురామ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారన్న విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా రఘురామను అరెస్టు చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదు. గతంలో ఉన్న కేసులకు సంబంధించి రఘురామ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులిచ్చిన తర్వాత రఘురామ సీఐడీ అధికారి సునీల్ కుమార్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, గొంది రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు.