iDreamPost
iDreamPost
రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దు అమరావతి ఒక్కటే ఉండాలని రాజధాని పరిధిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటు సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోలు పెట్టి వైరల్ చేసి దుష్ప్రచారానికి పాల్పడుతున్న ఆంద్ర మేదావుల ఫోరం కన్వినర్ చలసాని శ్రీనివాసరావుతో పాటు మరి కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
2017 నవంబర్ 30న అక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తు జరిగిన పోరాటంలో భాగంగా విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర కొంతమంది మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఆ సంధర్భంగా ఒక మహిళను పోలీసులు అరెస్టు చేసి వ్యానులోకి ఎక్కిస్తున్న దృశ్యాన్ని కొన్ని పత్రికలు ఆనాడు ప్రముఖుంగా ప్రచురించాయి.
అయితే చలసాని శ్రీనివాస రావు మాత్రం ఈ నెల 10వ తారీఖున బందరు రోడ్డు పై నిరసన ప్రదర్శిస్తున్న మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపిస్తూ 2017 నాటి ఆక్వాఫుడ్ ధర్నా మహిళ అరెస్ట్ ఫోటోని ఇప్పుటి సంఘటనగా చూపిస్తూ దురుద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారని కనుగొన్న పోలీసులు ఆ ఫోటో వెనక ఉన్న నిజాలను వెలికి తీసి చలసానితో పాటు మరికొంతమంది మార్ఫింగ్ ఫొటోల ప్రచారకుల పై కేసులు నమోదు చేశారు.