iDreamPost
android-app
ios-app

అక్కడ కేసీఆర్ మీద ఇక్కడ ఆ బిజెపి సీఎం మీద

అక్కడ కేసీఆర్ మీద ఇక్కడ ఆ బిజెపి సీఎం మీద

ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అసోం సిఎం చేసిన విమర్శలు పెద్ద దుమారమే రేపాయి. సర్జికల్ స్ట్రైక్ గురించి రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తండ్రి ఎవరో మేము అడిగామా అంటూ ఆయన చేసిన కామెంట్స్, ఆయనకు బిజెపి నేతల నుంచి వస్తున్న మద్దతు విమర్శలకు దారి తీసింది. దీనిపై తెలంగాణా సిఎం కేసీఆర్ కూడా ఘాటుగా స్పందిస్తూ బర్తరఫ్ చేయాలని బిజెపి అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.

ఇక దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఘాటుగానే స్పందించి రాష్ట్రంలో నిరసనలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఘాటుగానే మాట్లాడారు. అసోం సిఎం పై ఫిర్యాదు చేస్తామని… కేసీఆర్ కు దమ్ముంటే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో… అస్సాం సీఎం పై హైదరాబాద్ లో కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మూడు సెక్షన్ ల పైన ఆయనపై కేసు నమోదు చేేశారు. ఇది జరిగిన కాసేపటికే మరో పరిణామం చోటు చేసుకుంది. మీడియా సమావేశం సందర్భంగా సిఎం కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్ పై చేసిన వ్యాఖ్యలకు గాను అసోం లో పలు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేయాలని బిజెపి నేతలు ఫిర్యాదు చేేశారు. జాతి వ్యతిరేక భావాలు సిఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనితో కేసీఆర్ పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. రాహుల్ పై బిజెపి సిఎం చేసిన వ్యాఖ్యలపై సిఎం కేసీఆర్ స్పందించడం ఒక ఎత్తు అయితే… ఆ తర్వాత రేవంత్ రెడ్డి కేసు పెట్టడం, కేసు నమోదు చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో తెరాస నేతలు కూడా గాంధీ కుటుంబానికి సపోర్ట్ గా నిలవడం గమనార్హం. రాహుల్ కు కేసీఆర్ మద్దతు తర్వాత… తెరాస, కాంగ్రెస్ వర్సెస్ బిజెపిగా రాజకీయం మారిపోయింది. మరి ఈ కేసుల వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటీ అనేది చూడాలి. జాతీయ మీడియా సైతం ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది.

Also Read : డియ‌ర్ కేసీఆర్ గారూ.. ఇదిగో సాక్ష్యం : అస్సాం సీఎం కౌంట‌ర్