iDreamPost
iDreamPost
అందరు భయపడుతున్నట్లే కరొనా వైరస్ కొంప ముంచేట్లే ఉంది. ఏపిలో ఈ ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60కి చేరుకుంది. ఏపిలో ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడటానికి ప్రధాన కారణం ఢిల్లీ యాత్రే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈనెల 13-15వ తేదీల మధ్య ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్ధనలకు ఏపి నుండి 500 మంది ముస్లింలు వెళ్ళారు.
వాళ్ళిన వాళ్ళల్లో 13 జిల్లాల రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, కడప, అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల వాళ్ళున్నారు. ఎప్పుడైతే ఢిల్లీకి ఒకేసారి 500 మంది వెళ్ళి వచ్చిన విషయం బయటపడిందో వెంటనే ప్రభుత్వం ఒక్కసారిగి ఉలిక్కిపడింది. అందరినీ గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు తీసుకెళ్ళి స్క్రీనింగ్ టెస్టులు చేయించింది. వాటి పరీక్షలు ఈరోజే రావటంతో 11 మందికి పాజిటివ్ రిజల్టు వచ్చింది. అంటే వీళ్ళందరికీ కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
ఇంకా చాలామంది టెస్టు రిజల్ట్స్ రావాల్సుంది. వచ్చిన వారిలోనే 17 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అలాగే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారందరూ ఎక్కడెక్కడ తిరిగారు ? ఎవరెవరిని కలిశారు ? అనే విషయాలపై మొత్తం యంత్రాంగం ఆరాలు తీస్తోంది. ముందుజాగ్రత్తగానే ఐసొలేషన్ వార్డులకు తరలించినా ఉపయోగం కనబడలేదు.
ఇపుడు సమస్య ఏమిటంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కరోనా వైరస్ సోకిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళకు సోకటమే కాకుండా వీళ్ళ ద్వారా కుటుంబసభ్యులకు అలాగే వీళ్ళు కలిసిన వాళ్ళకు కూడా సోకే ప్రమాదం లేకపోతేలేదనే ఆలోచనే ప్రభుత్వంలో టెన్షన్ పెట్టేస్తోంది. చూస్తుంటే ఇటువంటి వాళ్ళ వల్లే వైరస్ కేసులు వందల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందనే టెన్షన్ పెరిగిపోతోంది. జనాలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉపయోగం ఏముంటుంది .