iDreamPost
android-app
ios-app

వీడియో: హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్‌పై దగ్ధమైన కారు! అందులోని వారు..

వీడియో: హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్‌పై దగ్ధమైన కారు! అందులోని వారు..

తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. షార్ట్ సర్యూట్, సాంకేతిక లోపం, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అలానే బస్సులు, కార్లు వంటి వాహనాల్లో సైతం అకస్మాత్తుగా మంటలు వచ్చి.. క్షణాల్లో కాలిబూడిదై పోతున్నాయి. ఇలాంటి ఘటనల్లో పలువురు సజీవ దహనమయ్యారు. మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. ఇక చాలా మంది తృటిలో ఇలాంటి అగ్నిప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ మహా నగరంలో పెను ప్రమాదమే తప్పింది. మోహిదీపట్నం పరిధిలోని మాసబ్ ట్యాంక్ వంతెన వద్ద మారుతి ఎస్ క్రాస్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జర్నీలో ఉన్న కారు నుంచి ఒకసారిగా మంటలు వచ్చాయి. దీంతో వెనుక వస్తున్న వాహనదారులు కారులోని వారికి సమాచారం ఇచ్చారు. దీంతో కారులోని వ్యక్తులు దాని రోడ్డుపై నిలిపారు. మాసప్ ట్యాంక్ వంతెనపై కారును నిలిపి.. అక్కడనుండి పరుగులు తీశారు. ఇక కారు క్షణాల్లోనే మంటల్లో కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు మంటలను ఆర్పి వేసిన.. అనంతరం కారణం పక్కకు తొలగించారు.

ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో చాలా సమయం పాటు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు.. కాలిపోయిన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్  చేశారు. మరి.. ఆ కారు ఎవరిది.. మంటలు రావడానికి గల కారణాలు ఏమిటి.. అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు మాత్రం వైరల్‌ అవుతున్నాయి. గతంలో కూడా కారులో మంటలు చెలరేగి.. అందులోని వ్యక్తులు సజీవ దహనమైన ఘటనలు ఎన్నో జరిగాయి. మరి.. ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి?. మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బూడిదైన రూ. 3 లక్షలు.. నెత్తి, నోరు బాదుకున్నరైతు!