iDreamPost

బూడిదైన రూ. 3 లక్షలు.. నెత్తి, నోరు బాదుకున్నరైతు!

బూడిదైన రూ. 3 లక్షలు.. నెత్తి, నోరు బాదుకున్నరైతు!

మాములుగా మన జేబులోంచి రూ.100 పడిపోతనే సగం ఆస్తి పొగొట్టుకున్నంతగా బాధపడుతుంటాం. కానీ, తాజాగా ఓ రైతు ఇంట్లో దాదాపు రూ.3 లక్షల నగదు బూడిద పాలైయ్యాయి. అవును, మీరు చదివింది నిజమే. పైసా పైసా కష్టపడి కూడబెట్టుకుంటే ఇలా సంపాదించిందంతా మంటల్లో కలిసిపోవడంతో ఆ రైతు నెత్తి, నోరు బాదుకుంటున్నాడు. తాజాగా తెలంగాణలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఆ డబ్బు ఎలా కాలిపోయింది. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం రాగిబావిలో ఎలుగ సత్తిరెడ్డి అనే రైతు నివాసం ఉంటున్నాడు. ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. అయితే గురువారం గ్రామంలో బోనాల పండగ కావడంతో సత్తిరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వనవాసం వెళ్లారు. కాగా, మధ్యాహ్నం ఉన్నట్టుండి వీరి ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు అప్రమత్తయ్యారు. వెంటనే సత్తిరెడ్డికి సమాచారం అందించారు. హుటాహుటిన అతడు ఇంటికి వచ్చి చూడగా షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో ఉన్న ఫ్రిజ్, ఫర్నీచర్ మంటల్లో కాలిపోయాయి.

దీంతో పాటు ఇంట్లో దాచి ఉంచిన దాదాపు రూ.3 లక్షల డబ్బు మంటల్లో కాలిపోయింది. ఇదే కాకుండా భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు సైతం మంటల్లో కాలిపోయాయి. ఇవన్నీ చూసి రైతు సత్తిరెడ్డి ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయి నెత్తి, నోరు బాదుకున్నాడు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాయం చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ.. డాక్టర్లు లేకుండానే 24/7 క్లినిక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి