iDreamPost
ఆచార్య దెబ్బకు స్క్రిప్ట్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకున్నారని వినికిడి. ఆచార్య గాయాన్ని మరిచిపోవాలంటే కొరటాల ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఒత్తిడి కొరటాలపై తీవ్ర స్థాయిలో ఉంది. దానికి తోడు మరో గండం కూడా ఉంది.
ఆచార్య దెబ్బకు స్క్రిప్ట్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకున్నారని వినికిడి. ఆచార్య గాయాన్ని మరిచిపోవాలంటే కొరటాల ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఒత్తిడి కొరటాలపై తీవ్ర స్థాయిలో ఉంది. దానికి తోడు మరో గండం కూడా ఉంది.
iDreamPost
ఆచార్యకు ముందు ఆచార్యకు తర్వాత అన్నట్లుగా ఉంది దర్శకుడు కొరటాల శివ పరిస్థితి. మిర్చి వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవి, రామ్ చరణ్ తో ఆయన తెరకెక్కించిన ఆచార్య మూవీ మాత్రం భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆచార్య పరాజయానికి కొరటాలే కారణం అనేది మెగా కాంపౌండ్ వాదన. దీంతో తన తదుపరి చిత్రంతో ఎలాగైనా తానేంటో నిరూపించుకోవాలనే తీవ్ర ఒత్తిడిలో కొరటాల ఉన్నాడు.
ఆచార్య ఫలితంతో చిరంజీవి తీవ్ర నిరాశ చెందాడు. సినిమా విడుదలై ఎనిమిది నెలలు దాటిపోయినా దాని నుంచి ఆయన బయటకు రాలేకపోతున్నాడు. అందుకేనేమో వీలు దొరికినప్పుడల్లా పరోక్షంగా కొరటాలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు. “అంతా తనకే తెలుసు అనే అహం ఉండకూడదు.. సీనియర్లు చెప్పిన సలహాలు పాటిస్తే సినిమా బాగా వస్తుంది” అని ఒక సందర్భంలో ఉన్నాడు. “హిట్ ఫ్లాప్ కాదు.. ముందు అనుకున్న టైమ్ కి సినిమా పూర్తి చేసి నిర్మాతకు నష్టం కలగకుండా చూడాలి” అని తాజాగా అన్నాడు. ఇలా పలు వేదికలపై ఆయన దర్శకులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు.. ఇన్ డైరెక్ట్ గా కొరటాలను అన్నట్లుగానే ఉందనే అభిప్రాయం కలుగుతోంది.
నెలలు గడుస్తున్నా ఆచార్య గాయాలు కొరటాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన ఆ మూవీ బిజినెస్ లో కూడా ఇన్వాల్వ్ కావడంతో నష్టాలను భర్తీ చేయాల్సి వచ్చింది. దానికి తోడు ఆచార్య ఫ్లాప్ కావడానికి తనదే పూర్తి బాధ్యత అనే నింద మోయాల్సి వస్తుంది. ఇప్పటికీ మెగా కాంపౌండ్ నుంచి పరోక్షంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కొరటాల తన తదుపరి చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో అనే ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం కొరటాల చేతిలో ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ ఉంది. ప్రకటన వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఆచార్య దెబ్బకు స్క్రిప్ట్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకున్నారని వినికిడి. ఆచార్య గాయాన్ని మరిచిపోవాలంటే కొరటాల ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఒత్తిడి కొరటాలపై తీవ్ర స్థాయిలో ఉంది. దానికి తోడు మరో గండం కూడా ఉంది. ఇది ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం. రాజమౌళితో సినిమా చేస్తే ఆ హీరో తదుపరి సినిమా ఫ్లాప్ అనే నెగటివ్ సెంటిమెంట్ ఉంది. ఇంతవరకు ఆ సెంటిమెంట్ ను ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఓ వైపు వెంటాడుతున్న ఆచార్య గాయం, మరోవైపు రాజమౌళి సెంటిమెంట్.. ఇంత తీవ్ర ఒత్తిడి మధ్య ఎన్టీఆర్30 తో హిట్ కొట్టి కొరటాల మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూద్దాం.