Idream media
Idream media
2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు రాహుల్ గాంధీ. ఆ నిర్ణయం నిజంగా చాలా హుందాగా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ భజన అంటారు గానీ… ఎంత మంది అలా రాజీనామాలు చేసారు…? కాంగ్రెస్ తో స్నేహం చేసే పెద్ద మనుషులు కూడా పార్టీ జాతీయ అధ్యక్షుల పేరుతో ఉండటం లేదూ… అవన్నీ ఎందుకు గానీ… ఆయన రాజీనామా చేసిన తర్వాత అనారోగ్య సమస్యలతో అమెరికా వెళ్లి వస్తున్న సోనియమ్మ… తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తిరిగి చేపట్టారు.
రెండేళ్ళ నుంచి ఆమె ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. పార్టీ బాధ్యతలను ఎక్కువగా ప్రియాంకా, రాహుల్ చూస్తున్నారు గాని ఏదైనా నిర్ణయం ఫైనల్ అవ్వాలి అంటే సోనియాతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 20 ఏళ్ళ వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు సోనియా. పార్టీలో తనకు గురువు, దైవంగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తర్వాత, తన ప్రధాన సలహాదారు అహ్మద్ పటేల్ అనారోగ్యంతో మరణించిన తర్వాత సోనియా ఒత్తిడి ఎదుర్కొన్నారు. అలాగే మరికొందరు సీనియర్ ల మరణం ఆమెను మరింత ఇబ్బంది పెట్టింది.
Also Read:ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా.. కారణం అదేనా?
ఇప్పుడు సోనియా చుట్టూ, రాహుల్ చుట్టూ ఉన్నదీ కొందరే… మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్ నాథ్, కర్ణాటక అగ్ర నేత కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్… వీరు మాత్రమె సోనియాకు నమ్మకంగా ఉన్నారు. ఇక రణదీప్ సుర్జేవాలా, సచిన్ పైలెట్, డీకే శివకుమార్, భూపేష్ భాఘెల్, ఎంపీ శశి తరూర్ వంటి వారు రాహుల్ కి అండగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ పీసీసీ చీఫ్, హర్యానా పీసీసీ చీఫ్, కర్ణాటక మాజీ మంత్రి దినేష్ గుండూ రావు, సిద్దరామయ్య తమ వంతుగా సహకారం అందిస్తున్నారు గాని… పార్టీని గాడిలో పెట్టలేకపోతున్నారు.
ఎంతో నమ్మకంతో లోక్సభ పక్ష నేతగా బాధ్యతలు అప్పగించిన అధిర్ రంజన్ చౌదరి… ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. పార్లమెంట్ లో ఆయన వల్ల కాంగ్రెస్ కు నష్టమే అనే విషయం జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసినప్పుడు స్పష్టంగా అర్ధమైంది. అయితే ఇప్పుడు సోనియా ఇక ఆలస్యం చేయవద్దు అనే ఆలోచనలో ఉన్నారు అనేది క్లియర్ గా అర్ధమవుతుంది. రాహుల్ ని మళ్ళీ పార్టీ చీఫ్ ని చేయాలని ఆమె పట్టుదలగా ఉన్నారు. కొడుకు తన మాట వినకపోవడంతో ముద్దుగా అంకుల్ అని పిలుచుకునే ఆయనకు రాహుల్ ని ఒప్పించే బాధ్యత అప్పగించారు.
రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ కు ఆమె బాధ్యతలు అప్పగించారు. తన భర్త రాజీవ్ గాంధీతో ఎంతో సన్నిహితంగా మెలిగిన అశోక్ గెహ్లాట్ విషయంలో ఆమె చాలా నమ్మకంగా ఉన్నారట. రాహుల్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడి నుంచే సమస్యను పరిష్కరించే బాధ్యతను అశోక్ కి అప్పగించారట సోనియా. అందులో భాగంగానే మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్ నాథ్ సహకారంతో రాహుల్ ఇప్పుడు కొన్ని పనులు మొదలుపెట్టారు. అన్ని రాష్ట్రాల పీసీసీలతో రాహుల్ మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణా అయింది…
Also Read:కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ.. గవర్నర్ ఆమోద ముద్ర వేసేనా?
పీసీసిలు ఏం చేయాలి ఏంటీ అనేది రాహుల్ వివరిస్తున్నారట… రాష్ట్రాల బాధ్యతను పీసీసీ చీఫ్ లు సమర్ధవంతంగా నిర్వహిస్తే తనకు జాతీయ స్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని… రాష్ట్రాల వ్యవహారాల్లో తల దూరిస్తే తన సమయం వృధా అవుతుందని రాహుల్… అశోక్ గెహ్లాట్ కు చెప్పారట. అందుకే ఈ సమావేశాల ద్వారా రాహుల్ తన మనసులో మాటను క్లియర్ గా చెప్పేస్తున్నారట. నమ్మకం ఉన్న వాళ్ళనే ఆయన ఢిల్లీ పిలుస్తున్నారట. ప్రతీ రాష్ట్ర పర్యటనకు తాను వస్తాను అని కాని పంచాయితీలు మాత్రం రాష్ట్రాల చీఫ్ లే చూసుకోవాలని ఆయన చెప్పెసారట.
సమర్ధులు అని భావించే వారికే పీసీసీ చీఫ్ లు గా పదవులు ఇస్తున్నారట ఆయన. ఇది అయిన తర్వాత విపక్షాలతో రాహుల్ సమావేశాలు నిర్వహిస్తారట. ముందుగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ… ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్, బీహార్ లో ఆర్జెడిలతో ఆయన తర్వాత మాట్లాడతారట. అలాగే మాజీ న్యాయమూర్తులతో చివరి దశలో రాహుల్ మాట్లాడే అవకాశం ఉందని, సుప్రీం కోర్ట్ లో వేసే కేసుల మీద వారి సలహాలను తీసుకుని ముందుకు వెళ్తారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఇప్పుడు టెన్ జన్పద్ బిజీ అయిపోయిందని… జీ చాయ్ పీలో అనే ఆహ్వానాలు మళ్ళీ అక్కడ మళ్ళీ వినపడుతున్నాయని అంటున్నారు. మరి రాహుల్ ని అశోక్ ఎంత వరకు ఒప్పిస్తారూ… ఆయనకు రోడ్ ఎంత నీట్ గా సెట్ చేసి ఇస్తారనేది చూడాలి.
Also Read:తాలిబాన్లలో “హక్కానీ” గ్రూప్ ప్రత్యేకం