Idream media
Idream media
విశేష అనుభవశాలిగా చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఇంకొన్నేళ్లు రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతి వైపు నడిచేలా చేయాల్సింది పోయి.. తద్విరుద్దంగా ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి తెచ్చారు. తాజాగా విడుదలైన ఓ నివేదికే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఆయన అధికారంలో ఉండగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా చవిచూడాల్సి వస్తోందని పేర్కొంది.మద్యం విధానాలలో అవలంబించిన తీరు, తన వాళ్లకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లినట్లు ఆ నివేదికను బట్టి తెలుస్తోంది. చంద్రబాబు ఏపీని పాలించిన 2014-19 మధ్య కాలంలో అస్మదీయులకు పరోక్షంగా లబ్ధి చేకూర్చిన నేపథ్యంలో రాష్ట్ర ఖజానా తీవ్రంగా నష్టపోయిందని.. తాజాగా విడుదలైన కాగ్ నివేదిక వెల్లడించింది.
టీడీపీ నేతలకు మేలు జరిగేలా
విజన్.. విజన్.. అని పదే పదే వల్లించే చంద్రబాబు రాష్ట్రం ఆర్థిక పరిస్థితికి పటిష్టంగా ఉండేలా ముందు చూపుతో వ్యవహరించాల్సింది పోయి, తన పాలనలో పార్టీ నేతలకు బాగానే దోచిపెట్టారని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా మద్యం ధరలు పెంచి విడి అమ్మకాలు జరిపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది.
2014–19 మధ్య బాబు పాలనలో ఎక్సైజ్ శాఖ పనితీరుకు సంబంధించి లోపాలను అక్రమాలను కాగ్ వెల్లడించింది. లైసెన్సుదారులు అపరాధ రుసుం చెల్లించకపోయినా లైసెన్సులు రద్దు చేయలేదని చాలా కేసుల్లో పన్నులు సుంకాలు వసూలు చేయకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయ నష్టం ఏర్పడిందని స్పష్టం చేసింది. మద్యం విక్రయాల్లో నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలను తీసుకోకపోవడంతో వారు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం కల్పించినట్టయిందని కాగ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
నివేదికలో ఏం ఉందంటే…
కమిటీ సిఫార్సు లేకుండానే 5 మద్యం ఉత్పత్తి కంపెనీలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేశారు. ఇందులో 4 కంపెనీల నుంచి రుసుములు వసూలు చేయలేదు. బీవీఎస్ డిస్టిలరీస్ విశాఖ డిస్టిలరీస్ పీఎంకే డిస్టిలరీస్ శ్రావణి ఆల్కో బ్రూవరీస్ నుంచి రూ.22.40 కోట్ల రుసుములు వసూలు చేయలేదు. మద్యం ఉత్పత్తి కంపెనీలు అదనంగా సామర్థ్యం పెంచుకోవడానికి 2016 ఆగస్టు సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
అయితే అదనంగా మంజూరు చేసిన మద్యం కోటాను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న సామర్థ్యం ప్రకారమే రుసుములను వసూలు చేసింది. దీనివల్ల రుసుముల రూపేణా రూ.13.24 కోట్లు వడ్డీ రూపేణా రూ.6.02 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది. 2014–15 నుంచి 2018–19 మధ్య కాలంలో 20475 నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల స్థితిగతులకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు. ఈ వివరాలను వెల్లడిస్తూ ఇదేనా చంద్రబాబు విజన్ అంటే.. అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.