iDreamPost
android-app
ios-app

1200 అడుగుల ఎత్తులో.. చిక్కుకుపోయిన కేబుల్‌ కారు..

1200 అడుగుల ఎత్తులో.. చిక్కుకుపోయిన కేబుల్‌ కారు..

చాలా మందికి యాత్రలు చేయడం  అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కొండలు, నదులు, అటవీ ప్రాంతాల్లో విహారయాత్రలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాక వివిధ పర్యాటక ప్రాంతాల్లో కేబుల్ కార్లు ఉంటాయి. వీటి ద్వారా అటవీ అందాలను కొన్ని వందల అడుగుల ఎత్తులో నుంచి వీక్షిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కేబుల్ కారులు ప్రమాదానికి గురవుతుంటాయి. తాజాగా 1200 అడుగుల ఎత్తులో ఓ కేబుల్ కారు వైర్ తెగి.. మధ్యలో చిక్కుకుపోయింది. అందులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…

పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్యవా ప్రావిన్సు కొండలు, లోయలతో కూడి ఉంటుంది. ఇక్కడి అటవీ అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ లోయను దాటేందుకు కేబుల్ కారు సౌకర్యం ఉంది. దీని ద్వారా నిత్యం పదుల సంఖ్యలో పర్యాటకులు ప్రయాణం చేస్తుంటారు. మంగళవారం కూడా లోయలను దాటేందుకు ఓ కేబుల్‌ కారు బయలు దేరింది. మార్గం మధ్యలో కేబుల్ కారు వైర్లు ఆకస్మికంగా తెగిపోయాయి. దీంతో ఆ కారు నేల నుంచి 1200 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయింది. అందులో ఆరుగురు విద్యార్థులు, మరో ఇద్దరు యువకులు చిక్కుకుపోయారు. మంగళవారం ఉదయం 7.00 గంటలకు ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే కేబుల్‌ తెగిపోయింది.

బట్టగ్రాం జిల్లాలోని అల్లాయి తహసీల్‌ పరిధిలో విద్యార్థులు పాఠశాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న పాక్ ఆర్మీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. దాదాపు 14 గంటలపాటు శ్రమించి అందులోని అందరినీ కాపాడింది. ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తులు ఈ కేబుల్‌ కారు నడుపుతున్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్ని.. పిల్లలను కాపాడిన ఆర్మీ బృందాలను, అధికారులను పాక్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వరుల్‌ హఖ్‌ కాకర్‌ అభినందించారు. అంతేకాక స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఇలాంటి ఘటనలు జరగడానికి నిర్లక్ష్యంగా వ్యవహిరించే వారికి ఎలాంటి శిక్షలు విధించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రష్యా విఫలమైన దగ్గర.. ఇండియా విజయం సాధించడానికి కారణం?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి