iDreamPost

రష్యా విఫలమైన దగ్గర.. ఇండియా విజయం సాధించడానికి కారణం?

రష్యా విఫలమైన దగ్గర.. ఇండియా విజయం సాధించడానికి కారణం?

జయహో భారత్.. జయహో ఇస్రో.. ఇప్పుడు యావత్ భారతదేశంలో వినిపిస్తున్న నినాదాలు ఇవే. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ ని దింపి భారత్ చరిత్ర సృష్టించింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కు ఇది మర్చిపోలేని ఘట్టం అంటూ ప్రధాని మోదీ అభివర్ణించారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తోంది. చంద్రుడిపై భవిష్యత్ లో జరగబోయే ప్రయోగాలకు చంద్రయాన్ 3 సక్సెస్ ఒక పునాది కానుంది. అయితే చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో.. చాలామంది లూనా-25 ఎందుకు ఫెయిల్ అయిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రయాన్ 3 ఎందుకు సక్సెస్ అయింది, లూనా-25 ఎందుకు ఫెయిలైందో చూద్దాం.

చంద్రయాన్ 3 సక్సెస్ తో ఇప్పటివరకు ఎవరూ చూడని దక్షిణ ధృవంపై భారత్ పరిశోధనలు మొదలు పెట్టనుంది. ప్రయోగం మొదలు పెట్టిన సరిగ్గా 40 రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగింది. చంద్రయాన్ 3 విజయాన్ని యావత్ భారతదేశం సెలబ్రేట్ చేసుకుంటోంది. అయితే ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగంతో పాటుగా రష్యా కూడా లూనా 25 మిషన్ ని చేపట్టింది. అయితే రష్యా ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. ప్రయోగం విఫలమైన తర్వాత రష్యా కూడా తమ తప్పులను అంగీకరించింది. ఎందుకు వారి మిషన్ విఫలమైందో వెల్లడించింది. రష్యా స్పేస్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

“లూనార్ మిషన్స్ చాలా రిస్కుతో కూడాకుని ఉంటాయి. వీటిలో సక్సెస్ రేటు 70 శాతం మాత్రమే ఉంటుంది. ఆగస్టు 19న లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆగస్టు 21న లూనా 25 చంద్రుడిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ, అనుకోకుండా వేరే ఆర్బిట్ లోకి ఎంటరైంది. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది” అంటూ వ్యాఖ్యానించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా మొదటిసారి చందమామపై పరిశోధనలు చేసేందుకు పూనుకుంది. కానీ, అది విఫలయత్నంగా మారింది. రష్యా ఫెయిల్ అవ్వడానికి వినిపిస్తున్న కారణాల్లో భారత్ మీద పంతానికి పోవడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు.

కేవలం పదే పది రోజుల్లో ఈ ప్రయోగాన్ని పూర్తి చేయాలని రష్యా నిర్ణయించుకున్నప్పుడే మిషన్ ఫెయిల్ అయ్యిందంటూ కామెంట్ చేస్తున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ కోసం 40 రోజులు ఎంతో సహనంతో ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు. కానీ, రష్యా మాత్రం మనపై పైచేయి సాధించాలనే ఉద్దేశంతోనే అభాసు పాలైందని చెబుతున్నారు. మరో కారణంగా కుందేలు- తాబేలు కథను చెప్పవచ్చు. అదేంటంటే.. రష్యా కుందేలు తరహాలో వేగంగా మిషన్ కంప్లీట్ చేయాలని భావించింది. కానీ, ఇస్రో మాత్రం తాబేలు తరహాలో సక్సెస్ అయి చూపించింది. ప్రయోగానికి 40 రోజుల సమయం తీసుకుంది. నిజానికి తాబేలు కన్నా కూడా ఇంకా నిదానంగా ఆఖరి 17 నిమిషాలను ఎంతో నిదానంగా సెకనుకు కేవలం 2 కిలోమీటర్ల వేగంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేసింది. నిజానికి రష్యా అనుకున్న దానికన్నా ఒకటిన్నర రెట్లు వేగంగా ల్యాండర్ దిగడం వల్ల కూడా ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్పారు. మొత్తానికి రష్యా సాధించలేకపోయిన దానిని భారత్ సాధించి చూపించింది. భారతదేశ ఖ్యాతిని ఇస్రో ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి