Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సమావేశం అయ్యారు. ఉద్యోగాల సంఘాలతో జరిగిన చర్చలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెలలో పడిన జీతాల పే స్లిప్ లు, గత నెలలో పడిన జీతాలతో టాలీ చేసుకుని పెరిగాయో, తగ్గాయో చూసుకుని స్పందించాలని ఓ వైపు మంత్రులు, మరో వైపు సీఎస్ ఉద్యోగులకు సూచిస్తున్నా.. ఉద్యమం ఉధృతం చేసేందుకు సిద్ధమవుతుండడంపై జగన్ దృష్టి సారించినట్లు తెలస్తోంది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు..
ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్ర ప్రసాద్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. సీఎస్ సమీర్ శర్మ తదితరులు పాల్గొనగా.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.. ఉద్యోగులు ఇవాళ చేపట్టిన పెన్ డౌన్, యాప్స్ డౌన్ పై కూడా ఈ సమావేశంలో చర్చ సాగుతోంది.. ఉద్యోగ సంఘాల డిమాండ్ల పై సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నారు.. పీఆర్సీ సహా హెచ్ఆర్ఏ, ఇతర డిమాండ్ల పైనా చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, సోమవారం నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నట్టుగా సమాచారం.. ఒకవేళ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే.. పాలన స్తంభించకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలను జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ చర్చలకు ఆహ్వానించారు.