Idream media
Idream media
మరి కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగబోతోంది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి పై జీఎం రావు కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చించనుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయా..? లేక ఒక్కటే ఉంటుందా..? అనేది సమావేశం అనంతరం తేలే అవకాశం ఉంది. మూడు రాజధానులను అమరావతి గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న సమయంలో వారిని శాంతింపజేసేందుకు మంత్రి వర్గం ఏం చేయబోతోందనేది ఆసక్తిగా మారింది. జిఎం రావు కమిటీ నివేదిక తో పాటు మరి కొన్ని అంశాలను మంత్రి వర్గంలో చర్చించనున్నారు. రాష్ట్ర భవిష్యత్ కు సంభందించిన అంశం కావడంతో ప్రజల్లో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జిఎన్ రావు కమిటీ ఏమి సూచించిందో ఒకసారి చూద్దాం.
అమరావతి- మంగళగిరి కాంప్లెక్స్ లో..
– లెజిస్లేటివ్ అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్, శాసనసభ,ఎమ్మెల్యే క్వార్టర్స్ వంటివి ఏర్పాటు.
– తుళ్లూరు ప్రాంతంలో ముంపు ప్రమాదం ఉన్న చోట్ల నిర్మాణాలు నిలిపివేయాలలి.
– అమరావతి రైతులకు సంబంధించి భూములు అభివృద్ధి చేసి అప్పగించాలి.
విశాఖపట్నంలో..
– ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం సెక్రటేరియేట్ తో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్, హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు.
– వేసవికాలంలో శాసనసభ సమావేశాలు జరపాలి.
కర్నూలులో..
– న్యాయవ్యవహారాల రాజధానిగా హైకోర్ట్ తో పాటుగా ఇతర న్యాయ సంస్థలు ఏర్పాటు.
– సీఎం క్యాంప్ ఆఫీస్, శీతాకాలపు వేసవి శాసనసభ సమావేశాలు జరపాలి.
– వెలిగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చెయ్యాలి.
– రాయలసీమ నీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చెయ్యాలి.
– గోదావరి-పెన్నా అనుసంధానం కూడా త్వరగా పూర్తి చెయ్యాలి.
నాలుగు రీజియన్లు…
– రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నాలుగు రీజియన్లుగా రాష్ట్రాన్ని విభజించాలని కమిటీసూచించింది.
– ఉత్తరాంధ్ర ఒక రీజియన్ గానూ, గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాను కలిపి మరో రీజియన్ గానూ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను మరో రీజియన్ గానూ, రాయలసీమ నాలుగు జిల్లాలు కలిపి ఒక రీజియన్ ఏర్పాటు చేయాలి.
– కర్ణాటక తరహాలో రీజియనల్ డెవలప్ మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి.