Idream media
Idream media
సీఎం జగన్ దూకుడు పెంచాడు హామీలు లక్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మొదటి ఏడాది లోనే వీలైనంత మేరకు హామీలు అమలు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు (బుధవారం) రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతోంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. చర్చించే అంశాలివీ…
– రాష్ట్ర ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ.46,675 కోట్ల వ్యయంతో భారీ వాటర్ గ్రిడ్.
– మగ్గం ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఏడాదికి రూ.24వేల చొప్పున డిసెంబర్ 21న ఆరి్థక సాయం అందించేందుకు విధివిధానాలు.
– ఇసుక రవాణాకు సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 6000 వాహనాలను ఆయా వర్గాల యువతకు సమకూర్చడం.
– ఔట్ సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థను నిర్మూలించి రాష్ట్రస్థాయిలో డిసెంబర్ 1 నుంచి కార్పొరేషన్ ఏర్పాటు.
– జనవరి 26 నుంచి జగనన్న అమ్మ ఒడి పథకం అమలు.
– చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించేందుకు, ఆ పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచేందుకు వీలుగా ప్రత్యేకంగా బోర్డు. దీనితోపాటు పప్పు, వరి ధాన్యాల బోర్డులు.
– గ్రామ న్యాయాలయాలు, ఉన్నత విద్య, స్కూలు విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల సభ్యుల నియామకాలు..
– రోబో ఇసుక తయారీ.
– ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం రూ.50కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకం.